Lawrence Bishnoi Gang : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
హర్యానాలో పట్టుకున్న పోలీసులు
Lawrence Bishnoi Gang : పంజాబ్ ప్రముఖ సింగర్ సిద్దూ మూసే వాలా హత్య కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి బిగ్ షాక్ తగిలింది.
ఈ గ్యాంగ్ స్టర్ టీంకు చెందిన నలుగురు కరుడు గట్టిన నేరస్థులను హర్యానాలో పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో లారెన్స్ బృందంలో కీలక సభ్యులుగా ఉన్నారు.
పట్టుబడిన వారిలో శశాంక్ పాండే, సాహిల్ అలియాస్ బగ్గా, అశ్వని అలియాస్ మనీష్ , బంతి ఉన్నారు. నిందితుల్లో ఒకరు యూపీలోని గోరఖ్
పూర్ కి చెందిన వారని, మిగతా ముగ్గురు క్రిమినల్స్ హర్యానా లోని అంబాలాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.
గత కొంత కాలం నుంచీ వీరంతా లారెన్స్ బృందంలో ఉంటూ పని చేస్తున్నారని చెప్పారు. వీళ్లకు ఘనమైన నేర చరిత్ర ఉందన్నారు.
అయితే అంబాలా కంటోన్మెంట్ కు పక్కనే ఉన్న బేబియాల్ గ్రామానికి చెందిన వారంతా తీవ్రమైన నేర చరిత్ర కలిగి ఉన్న వారని చెప్పారు.
శనివారం రాత్రి అరెస్ట్ చేశామన్నారు. ఈ కరడు గట్టిన నేరస్థుల నుంచి మూడు పిస్టల్స్ , 22 లైవ్ కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నలుగురు నేరస్థులు బేబియాల్ శ్మశాన వాటిక సమీపంలో ఉన్నారని సమాచారం తెలియడంతో వల పన్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా సిద్దూ మూసే వాలా హత్యకు తానే ప్లాన్ చేశానని లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi Gang) చివరకు పోలీసుల విచారణ లో ఒప్పుకున్నాడు. ఇటీవలే సిద్దూ కేసులో కీలక షూటర్లు ఇద్దరిని పంజాబ్ పోలీసులు ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టారు.
దీంతో తనకు ప్రాణ భయం ఉందంటూ లారెన్స్ బిష్ణోయ్ కోర్టును ఆశ్రయించాడు. మరో వైపు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపుతానంటూ
సవాల్ విసిరాడు ఈ గ్యాంగ్ స్టర్.
Also Read : పార్థ ఛటర్జీ అరెస్ట్ పై జోక్యం చేసుకోం