PM Modi : చట్టాలు ప్రాంతీయ భాషల్లో ఉండాలి – మోదీ
భాష ఎప్పుడూ సంక్లిష్టంగా ఉండ కూడదు
PM Modi : ఓ వైపు జాతీయ భాషగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో స్థానిక , ప్రాంతీయ భాషలపై ప్రధాన మంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం న్యాయ శాఖ మంత్రులతో జరిగిన సమావేశంలో మోదీ(PM Modi) ప్రసంగించారు. కాలం చెల్లిన చట్టాల వల్ల ఉపయోగం లేదన్నారు.
ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలలో ఇంకా రాజుల కాలం నాటి చట్టాలే రాజ్యం ఏలుతున్నాయని వాటిని తీసి వేసేందుకు కృషి జరగాలన్నారు. ప్రాంతీయ భాషలకు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. న్యాయంలో జరుగుతున్న జాప్యాన్ని పరిష్కరించేందుకు ఫోకస్ పెట్టాలని సూచించారు.
ఇందుకు సంబంధించి భాష అవరోధం కాకూడదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తీర్పులు, చట్టాలు అన్నీ కేవలం రెండు భాషల్లోనే ఉండడం వల్ల ఏం జరుగుతుందో ఏం అందులో ఉందో ఎవరికీ తెలియడం లేదన్నారు. కోట్లాది సామాన్యులకు మేలు చేయని, అర్థం కాని చట్టాలు ఉండీ ఏం లాభమని ప్రశ్నించారు మోదీ.
ముందుకు ప్రక్షాళన జరగాల్సింది చట్టాల్లోనేనని పేర్కొన్నారు. న్యాయం స్వంత భాషలో ఉంటే మేలు జరుగుతుందన్నారు. ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం జనం తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు మోదీ(PM Modi). ఇకనైనా న్యాయ నిపుణులు, కోవిదులు ముందు చట్టాలను మార్చడం, సులభంగా ఉండేలా తీర్చి దిద్దడం ఎలాగో ప్రయత్నం చేస్తే బావుంటుందన్నారు నరేంద్ర మోదీ.
సమర్థవంతమైన దేశం , సామరస్య పూర్వక సమాజానికి సున్నితమైన న్యాయ వ్యవస్థ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ. సమర్థవంతమైన దేశం , సామరస్య పూర్వక సమాజానికి సున్నితమైన న్యాయ వ్యవస్థ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ.
Also Read : సోషలిస్టులతో దోస్తీ బీజేపీతో కుస్తీ – నితీశ్