P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంకు కోలుకోలేని షాక్ తగిలింది. బుధవారం కోల్ కతాలో ఒక న్యాయ పరమైన అంశంలో న్యాయవాదిగా హాజరయ్యేందకు వచ్చారు.
ఈ సందర్బంగా హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కొందరు న్యాయవాదులు పి. చిదంబరంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారంతా నిప్పులు చెరిగారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన సానుభూతిపరుడు అంటూ తీవ్ర ఆరోపణలు చస్త్రశారు. కోర్టు వద్ద కాంగ్రెస్ సెల్ కు చెందిన లాయర్ల బృందం రాజ్యసభ ఎంపీ అయిన పి. చిదంబరం (P Chidambaram)కోర్టు నుంచి బయటకు వెళుతుండగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయనకు నల్ల వస్త్రాలు, జెండాలు చూపించి నిరసన తెలిపారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం, రాష్ట్రంలో పార్టీ కోల్పోవడానికి ప్రధాన కారణం పి. చిదంబరమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆగ్రో ప్రాసెసింగ్ సంస్థ కెవెంటర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రాతినిధ్యం వహిస్తుండడంపై మండి పడ్డారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ చౌదరి కేసు వేసిన కంపెనీకి ఎలా ప్రాతినిధ్యం వహిస్తారంటూ ప్రశ్నించారు.
మెట్రో డెయిరీ వాటాలను ప్రైవేట్ కంపెనీకి విక్రయించాలన్న టీఎంసీ ప్రభుత్వ నిర్ణయాన్ని చౌదరి సవాల్ చేశారు. చిదంబరం హాజరు కావడంపై చౌదరి మాట్లాడారు.
వృత్తి పరమైన ప్రపంచంలో తన ఎంపికను ఎంచుకునే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంటుదన్నారు. నిరసన తెలుపడం వారి హక్కు. వాదించడం న్యాయవాదిగా చిదంబరంకు ఉన్న హక్కు అని పేర్కొన్నారు.
Also Read : ఎంపీ, ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు