DK Shivakumar : బీజేపీ నుంచి వలసలు తప్పవు – డీకే
సవాది తమ పార్టీలో చేరనున్నారు
DK Shivakumar : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం యెడ్డీకి వీర విధేయుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది ఇవాళ డీకే శివకుమార్ , సిద్దరామయ్య, రణ్ దీప్ సూర్జేవాలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. లక్ష్మణ్ సవాది గొప్ప నాయకుడు. ఆయనకు లింగాయత్ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. ప్రజల కోసం పనిచేస్తూ వచ్చారు. అలాంటి నేత తమ పార్టీలో చేరతామంటే ఆహ్వానిస్తామని చెప్పారు డీకే శివకుమార్(DK Shivakumar) .
ఆయన పని చేసినా బీజేపీ పట్టించు కోలేదన్నారు. తమ పార్టీలో లక్ష్మణ్ సవాదికి తగు స్థానం ఉంటుందన్నారు. అంతే కాకుండా బీజేపీ నుంచి మరికొందరు సీనియర్లు, ఎమ్మెల్యేలు, టికెట్లు కోల్పోయిన వారంతా తమ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారంటూ సంచలన ప్రకటన చేశారు.
లక్ష్మణ్ సవాది తన స్వంత ఇష్టానుసారం కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడయ్యేందుకు అంగీకరించాడని తెలిపారు కేపీసీసీ చీఫ్. బీజేపీ ఎమ్మెల్సీ సవాడి శాసన మండలి చైర్మన్ కు రాజీనామా సమర్పిస్తారని తెలిపారు. ఆ తర్వాత అధికారికంగా తమ పార్టీలో చేరుతారని చెప్పారు డీకే శివకుమార్. సవాడి అభ్యర్థనను పట్టించుకోకుండా బీజేపీ ఈ వారం ప్రారంభంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహస్త్రష్ కుమతల్లికి బెలగావి జిల్లాలోని అథని స్థానాన్ని కేటాయించింది.
Also Read : డీకే శివకుమార్ తో లక్ష్మణ్ సవాది భేటీ