LET Commander : గత కొంత కాలంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆగడాలకు కట్టడి చేసేందుకు భారత ఆర్మీ యత్నిస్తోంది. దాడులు ముమ్మరం చేసింది. ఇప్పటికే 7 గురు ఉగ్రవాదులను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా డిక్లేర్ చేసింది.
తాజాగా కాశ్మీర్ లోని బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిగా (ఎల్ఈటీ ) అగ్ర నాయకుడు (కమాండర్ ) గా పేరొందిన యూసఫ్ కాంత్రూను మట్టుబెట్టింది.
ఇండియన్ ఆర్మీ హిట్ లిస్టులో ఉన్న ఎల్ఇటీ కమాండర్ కోసం గత కొంత కాలం నుంచి సెర్చింగ్ కొనసాగుతూ వస్తోంది. విచిత్రం ఏమిటంటే యూసుఫ్ కాంత్రూ అనేకమంది పౌరుల్ని, భద్రతా దళాల సిబ్బందిని(LET Commander) హత్య చేసిన వారిలో కీలకంగా ఉన్నాడు.
పౌరులే లక్ష్యంగా హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు లోయలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ హతమైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదిని భద్రతా బలగాల హిట్ లిస్టులో (LET Commander)ఉన్న ఎల్ఇటి కమాండర్ యూసుఫ్ కాంత్రూగా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ తెలిపారు.
ఇటీవల బుద్గామ్ జిల్లాలో ఒక ఎస్పీఓ , సోదరుడు, ఒక సైనికుడు, ఒక పౌరుడిని చంపడంతో సహా పలువురి హత్యలలో పాలు పంచుకున్నాడు. బుద్గాం , బారాముల్లా సరిహద్దు గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించినట్లు విజయ్ కుమార్ వెల్లడించారు.
Also Read : పీకే బ్లూ ప్రింట్ పై కాంగ్రెస్ ఆరా