Yashwant Sinha : ఇంకెంత కాలం ఉండగలనో చూడాలి
యశ్వంత్ సిన్హా సంచలన కామెంట్స్
Yashwant Sinha : ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా సంచలన కామెంట్స్ చేశారు. తాను ఇక ఎంత కాలం ప్రజా జీవితంలో ఉండగలనో చూడాలన్నారు.
ప్రస్తుతం నాకు 84 ఏళ్లు. ఈ వయస్సులో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. కానీ ఇంకా ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన నన్ను ఇంత దాకా తీసుకు వచ్చిందన్నారు సిన్హా.
ఆరోగ్య పరంగా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఏదో రకంగా సేవలో కొనసాగాలన్నదే నా తపన అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించాలో కూడా ఆలోచించు కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు యశ్వంత్ సిన్హా(Yashwant Sinha).
తాను మరే ఇతర రాజకీయ పార్టీలో చేరబోనన్నారు. అయితే స్వతంత్రంగా ఉండనని మాత్రం కుండ బద్దలు కొట్టారు. ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయించు కోలేదని చెప్పారు సిన్హా.
కానీ నన్ను అభిమానించే వారంతా తాను ఇంకా పాలిటిక్స్ లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వారు.
మొదట్లో ఐఏఎస్ కి ఎంపికయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వాజ్ పేయ్ సర్కార్ లో కీలకమైన ఆర్థిక మంత్రి పదవి చేపట్టారు. బీజేపీలో కీలకమైన పోస్ట్ లో ఉన్నారు.
కానీ మోదీతో పొసగక బయటకు వచ్చేశారు. ఆపై గత ఎన్నికల సందర్భంగా టీఎంసీలో చేరారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం ఏం చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సిన్హా (Yashwant Sinha) వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : ఈడీ ముందుకు మరోసారి సోనియా