Rishi Sunak : దేశం కోసం క‌లిసి న‌డుద్దాం – రిషి సున‌క్

బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి దేశ ప్ర‌జ‌ల‌కు విన్న‌పం

Rishi Sunak : భార‌తీయ మూలాలు క‌లిగిన 42 ఏళ్ల రిషి సున‌క్ బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. మ‌న ముందు స‌వాళ్లు ఉన్నాయ‌ని వాటిని ఎదుర్కోవాలంటే అంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. అధికార పార్టీ క‌న్జ‌ర్వేటివ్ స‌భ్యుల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుదామ‌ని, ప్ర‌స్తుతం దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని దీనిని ప‌రిష్క‌రించాలంటే మీ అంద‌రి స‌హ‌కారం త‌న‌కు కావాల‌ని కోరారు. జాతి మంచి కోసం మ‌నంతా క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రిషి సున‌క్(Rishi Sunak). పార్టీ నుంచి ఇద్ద‌రు వైదొలిగారు. ప్ర‌తిప‌క్షాలు మ‌న‌పై దాడి చేస్తున్నాయి.

ఇంకో వైపు దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ త‌రుణంలో మ‌న‌ముందు ఉన్న‌ది ఒకే ఒక్క‌టి అంద‌రం క‌లిసి అడుగులు వేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఎన్నో స‌వాళ్ల‌ను అధిగ‌మించి అత్యున్న‌త ప‌ద‌విని ద‌క్కించు కోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

200 ఏళ్ల త‌ర్వాత అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన వ్య‌క్తి పీఎంగా కొలువు తీర‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. ఆయ‌న కంటే ముందు ఇద్ద‌రు వైదొలిగారు. ఒక‌రు అవినీతి ఆరోప‌ణ‌లు, స్కాంల కార‌ణంగా బోరిస్ జాన్స‌న్ త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో సున‌క్ లిజ్ ట్ర‌స్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

అనంత‌రం ఆమె 45 రోజుల అనంత‌రం తాను కూడా చేతులెత్తేసింది. రాజీనామా ప్ర‌క‌టించింది. ఈ త‌రుణంలో అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చారు రిషి సున‌క్ . త‌న‌ను తాను గ్రేట్ లీడ‌ర్ న‌ని నిరూపించుకున్నారు.

Also Read : ప‌వ‌ర్ పాలిటిక్స్ లో ‘సున‌క్’ సునామీ

Leave A Reply

Your Email Id will not be published!