PM Modi Rishi Sunak : మిత్ర‌మా క‌లిసి న‌డుద్దాం – మోదీ

బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సున‌క్ కు కంగ్రాట్స్

PM Modi Rishi Sunak : బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరారు భార‌తీయ సంత‌తికి చెందిన రిషి సున‌క్. ఈ సంద‌ర్భంగా రిషి సున‌క్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi Rishi Sunak). ప్ర‌పంచ స‌మ‌స్య‌ల‌పై క‌లిసి ప‌ని చేసేందుకు రోడ్ మ్యాప్ 2030ని అమ‌లు చేసేందుకు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గ‌ట్టెక్కించే శ‌క్తి సామ‌ర్థ్యాలు రిషి సున‌క్ కు ఉన్నాయ‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. భార‌త్, బ్రిట‌న్ దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా రిషి సున‌క్ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ భార‌తీయ దిగ్గ‌జ ఐటీ కంపెనీగా పేరొందిన ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి అల్లుడు.

ఆయ‌న కూతురు అక్ష‌తా మూర్తిని పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత పీఎం రేసులో నిలిచారు. చివ‌ర‌కు ఊహించ‌ని రీతిలో విజ‌యం సాధించారు. పీఎంగా ఎన్నిక‌య్యారు. 200 ఏళ్ల త‌ర్వాత అత్యంత పిన్న వ‌య‌సు 42 ఏళ్లు క‌లిగిన ప్ర‌ధాన‌మంత్రిగా రిషి సున‌క్ చ‌రిత్ర సృష్టించారు.

క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ప్ర‌వాస భార‌తీయుడిగా అరుదైన ఘ‌న‌త సాధించాడు. మాజీ ప్ర‌ధాన మంత్రి బోరీస్ జాన్స‌న్ , పెన్నీ మోర్డాంట్ ల‌ను కాద‌ని రిషి సున‌క్ విజేత‌గా నిలిచాడు. ఇదిలా ఉండగా త‌న‌ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు రిషి సున‌క్.

Also Read : అల్లుడు పీఎం ఇన్ఫోసిస్ చైర్మ‌న్ సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!