BRS Party EC : బీఆర్ఎస్ ఆమోదం కోసం ఈసీకి లేఖ
283 మంది ప్రతినిధుల తీర్మానం
BRS Party EC : కేంద్రంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్. ప్రధాని మోదీని, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఇందులో భాగంగా తాను జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు చాలా కసరత్తు చేశాడు. చివరకు కేసీఆర్ ప్రకటించిన మేరకే విజయ దశమి పండుగ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా(BRS Party) మారుస్తున్నట్లు వెల్లడించారు.
పార్టీ సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు ఆమోదం కూడా తెలిపారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ పేరును ప్రకటించారు కేసీఆర్. దేశ రాజకీయాల్లో ఎందుకు తాను వెళ్లాలని అనుకుంటున్నాననో సమావేశం సాక్షిగా వివరించే ప్రయత్నం చేశారు.
దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం , జీడీపీ వృద్ది రేటు ఎలా దెబ్బ తిన్నదో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. దేశంలో అపారమైన వనరులు ఉన్నా ఇప్పటి వరకు సరిగా ఉపయోగించు కోలేదని ఆరోపించారు కేసీఆర్.
అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ సమావేశంలో భారత రాష్ట్ర సమితిగా సవరణ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. సదరు తీర్మానంపై కేసీఆర్ సంతకం చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ సీఎం దేవగౌడ , తదితర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించినట్లు తెలిపారు. తీర్మానం కాపీని ఎన్నికల కమిషన్ కు సమర్పించనున్నారు.
ఇక దరఖాస్తు అందిన తర్వాత నిర్ణీత గడువు లోగా ఈసీ కీలక ప్రకటన చేసే చాన్స్ ఉంది.
Also Read : టీఆర్ఎస్ కాదు ఇక బీఆర్ఎస్ – కేసీఆర్