Arvind Kejriwal : సీఎం సింగపూర్ టూర్ కు ఎల్జీ అడ్డంకి

మేయ‌ర్లు మాత్ర‌మే వెళ్లాల‌ని అభ్యంత‌రం

Arvind Kejriwal : సింగ‌పూర్ ప్రభుత్వం ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు త‌మ దేశం రావాల్సిందిగా ఆహ్వానించింది. అయితే సీఎం వెళ్లేందుకు ముందే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కానీ మేయ‌ర్లు వెళ్లాల‌ని సీఎం కాదంటూ లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అడ్డు పుల్ల వేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

తాను వెళ్ల‌కుండా పీఎం మోదీ అడ్డుకున్నారంటూ ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. వ‌చ్చే నెల‌లో శిఖ‌రాగ్ర స‌మావేశం సింగ‌పూర్ లో జ‌ర‌గ‌నుంది. ఇందులో ప్ర‌త్యేకంగా మాట్లాడాల్సిందిగా సీఎంకు ఆహ్వానం అందింది. 4

ఈ మేర‌కు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ముంద‌స్తుగా త‌న‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల‌ని కోరారు సీఎం. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి కోరుతూ ఢిల్లీ ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన ఫైల్ ను లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా తిరస్క‌రించార‌ని లెఫ్లినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం తెలిపింది.

సింగ‌పూర్ లో జ‌రిగే ప్ర‌పంచ న‌గ‌రాల స‌ద‌స్సుకు హాజ‌రు కావ‌ద్ద‌ని ఎల్జీ కేజ్రీవాల్(Arvind Kejriwal)  కు సూచించార‌ని , ఇది మేయ‌ర్ ల స‌ద‌స్సు కాబ‌ట్టి సీఎం హాజ‌రు కావ‌డం త‌గ‌ద‌ని తెలిపినట్లు ఏఎన్ఐ వెల్ల‌డించింది.

కేజ్రీవాల్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను స‌క్సేనా తిరిగి ఇచ్చార‌ని , ఈ స‌ద‌స్సు ప‌ట్టణ పాల‌న‌లోని వివిధ అంశాల‌ను క‌వ‌ర్ చేస్తుంద‌ని పేర్కొంది.

స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీ స‌ర్కార్ కు ప్ర‌త్యేక డొమైన్ లేద‌ని సీఎం హాజ‌రు కావ‌డం అనుచితం అని ఎల్ జీ తెలుప‌డం విశేషం. ఢిల్లీ మోడ‌ల్ గురించి ప్ర‌సంగించాల్సిందిగా సింగ‌పూర్ కోరింది.

కానీ మోదీ ప్ర‌భుత్వం కావాల‌నే అడ్డు తగులుతోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.

Also Read : సోనియా గాంధీపై ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Leave A Reply

Your Email Id will not be published!