LG Offered KC Venugopal : యాత్రకు ఎల్జీ సిన్హా లైన్ క్లియర్
కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్
LG Offered KC Venugopal : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(LG Offered KC Venugopal) వెల్లడించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎంవై తరిగామి జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించాక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్.
ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ ఎల్జీతో తనతో పాటు జమ్మూ కాశ్మీర్ పార్టీ ఇన్ ఛార్జ్ రజనీ పాటిల్ కూడా పాల్గొన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న భారత్ జోడో యాత్రకు జమ్మూ కాశ్మీర్ ఎల్జీ సిన్హా అన్ని రకాల సహాయ సహకారాలు అందించారని ఇందుకు తాము ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నామని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్. భారత్ జోడో పాదయాత్ర జాతీయ పాదయాత్ర. కశ్మీర్ లో కూడా జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తామన్నారు.
ఇదిలా ఉండగా కరోనా ప్రస్తుతం తీవ్రంగా వ్యాపిస్తోందని, దీంతో కరోనా కట్టడిలో భాగంగా యాత్రను నిలిపి వేసేందుకు ఆలోచించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లేఖ రాశారు.
ఇదంతా కావాలని కేంద్రం, బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. చైనా నుండి విమానాలు వస్తున్నాయని కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభలకు హాజరవుతున్నారని కానీ ఎలాంటి లేఖలు లేవన్నారు.
Also Read : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతాం