Rishi Sunak : బ్రిట‌న్ ప్ర‌ధానిగా ‘రిషి’కి లైన్ క్లియ‌ర్

పోటీ నుంచి త‌ప్పుకున్న జాన్స‌న్

Rishi Sunak : బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి లిజ్ ట్ర‌స్ రాజీనామా చేయ‌డంతో నెల‌కొన్న సంక్షోభానికి సోమ‌వారం నాటితో తెర ప‌డ‌నుంది. ఈ మేర‌కు పీఎం రేసులో భార‌తీయ మూలాలు క‌లిగిన రిషి సున‌క్ , మాజీ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ తో పాటు పెన్నీ మార్డెంట్ నిలిచారు. తీరా అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో 144 మందికి పైగా స‌భ్యులు ఏకగ్రీవంగా రిషి సున‌క్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

దాంతో అనూహ్యంగా నిన్న‌టి దాకా బ‌రిలో ఉన్న మాజీ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ ఇవాళ తాను త‌ప్పుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. ఇక మ‌రో పోటీదారుగా ఉన్న పెన్నీ మార్డెంట్ కు ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించ లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క‌డు రిషి సున‌క్.

ఇవాళ బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రిగా రిషి సున‌క్(Rishi Sunak) ఎంపిక‌య్యే ఛాన్స్ ఉంద‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. కాగా ఇంకా పెన్నీ పోటీ నుంచి త‌ప్పుకోలేదు. ఒక‌వేళ ఆమె గ‌నుక 100 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌డితే అప్పుడు పోటీ రిషి సున‌క్ , పెన్నీ మార్డెంట్ మ‌ధ్య మొద‌ల‌వుతుంది.

ఇద్ద‌రిలో ఎవ‌రు ఫైన‌ల్ గా ఎంపిక అవుతార‌నేది ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో లిజ్ ట్ర‌స్ రిషి సున‌క్ పై గెలుపొందారు. ప్ర‌ధానిగా కొలువు తీరారు. కానీ 45 రోజుల త‌ర్వాత చేతులెత్తేశారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రిషి సున‌క్ తాను పోటీలో ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

మొత్తంగా రాజ‌కీయ సంక్షోభానికి ఇవాల్టితో తెర ప‌డనుందా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : బ్రిట‌న్ ప్ర‌ధాని రేసు నుంచి జాన్స‌న్ అవుట్

Leave A Reply

Your Email Id will not be published!