Sindhu Biswal : లింక్డ్ ఇన్ టాప్ క్రియేటర్ సింధు బిశ్వాల్
ప్రకటించిన సోషల్ మీడియా దిగ్గజం
Sindhu Biswal : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కి చెందిన ప్రముఖ సామాజిక సంస్థ లింక్డ్ ఇన్ సంచలన ప్రకటన చేసింది. మోస్ట్ క్రియేటర్ గా భారత దేశానికి చెందిన సింధు బిస్వాల్(Sindhu Biswal ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఎవరీ సింధు బిస్వాల్ అని ప్రపంచం వెదుకుతోంది.
ఈ లింక్డ్ ఇన్ మాధ్యమంలో వరల్డ్ వైడ్ గా ఆయా కంపెనీల చైర్మన్లు, ఎండీలు, సీఎండీలు, వివిధ రంగాలకు చెందిన అత్యున్నతమైన వ్యక్తులు, ప్రముఖులు సభ్యులై ఉంటారు.
ఇందులో కనీసం వెయ్యి మంది సభ్యుల్ని కలిగి ఉంటే అదో గొప్ప స్టేటస్ సింబల్ గా భావిస్తారు. మరి లింక్డ్ ఇన్ ఎందుకు సింధు బిస్వాల్ ను
క్రియేటర్ గా ఎంపిక చేసిందనేది విస్తు పోయేలా చేసింది.
అగ్ర సృష్టికర్తగా పేర్కొంది. ఒడిశాకు చెందిన ఎంబీయే గ్రాడ్యుయేట్ ఈ సింధు బిశ్వాల్. స్టార్టప్ లు , మార్కెటింగ్ లో మంచి వక్త. యావత్
ప్రపంచం తెలుసు కోవాల్సిన అగ్ర సృష్టికర్త (మోస్ట్ క్రియేటర్స్ ) లు ఐదు మందిలో సింధు బిశ్వాల్ ను ఒకడిగా చేర్చింది లింక్డ్ ఇన్.
యుఎస్ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ ఎడిటర్ ఇన్ చీఫ్ , వైస్ ప్రెసిడెంట్ అయిన డేనియల్ రోత్ దీనిని వెల్లడించారు. ఈ సందర్భంగా సింధు బిశ్వాల్(Sindhu Biswal) స్పందించాడు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన లింక్డ్ ఇన్ తనను చేర్చినందుకు సంతోషం కలుగుతోందన్నాడు. కటక్ లో పుట్టాడు. నోయిడా లోని అమిటి యూనివర్శిటీ నుండి ఎంబీ చేశాడు.
ఎనిమిదేళ్లుగా ప్రొఫెషనల్ గా ఉన్నాడు. ముంబైలో పని చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. యూట్యూబ్ చానల్ కలిగి ఉన్నాడు. అతడి
ఛానల్ లో స్టార్టప్ లు, మార్కెటింగ్ , లైఫ్ , ఫిలాసఫీ, దుర్బలత్వాలు, తదితర వాటి గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు.
సంగీతకారుడు, ఫోటోగ్రాఫర్ కూడా. అంతకంటే ఎక్కువగా మార్కెటర్. బెంగళూరులోని బెటర్ హాఫ్ లో గ్రోత్ హెడ్ గా ఉన్నాడు.
Also Read : జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు