MLC Kavitha : లిక్క‌ర్ స్కాం అబ‌ద్దం విచార‌ణ‌కు సిద్దం – క‌విత‌

భార‌తీయ జ‌నతా పార్టీ ఆడుతున్న రాజ‌కీయం

MLC Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి త‌న పేరు రావ‌డంపై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత(MLC Kavitha) స్పందించారు. మ‌ద్యం స్కాం అబ‌ద్ద‌మ‌ని, ఎలాంటి విచార‌ణ‌కైనా తాను సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. గురువారం క‌విత మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరిగారు క‌విత‌.

తాను ఎలాంటి విచార‌ణ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా బెదిరింపుల‌కు భ‌య‌పడేది లేద‌న్నారు. ఇదంతా ద‌క్షిణాదిన పేరొందిన ప్ర‌ముఖుల‌ను కావాల‌ని నార్త్ కు చెందిన నేత‌లు బ‌ద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు భ‌య‌ప‌డన‌ని ప్ర‌క‌టించారు. దేశంలో మోదీ కొలువు తీరాక బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను టార్గెట్ చేసిందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు లొంగ‌డం లేద‌ని అందుకే బెదిరింపుల‌కు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్ప‌డుతున్నారంటూ మండిప‌డ్డారు.

9 రాష్ట్రాల‌ను దొడ్డి దారిన కూల్చి వేశారంటూ ఫైర్ అయ్యారు. వ‌చ్చే డిసెంబ‌ర్ లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని అందుకే ముందు ప్ర‌ధాని మోదీ ఎంట‌ర్ అయ్యార‌ని, ఆ త‌ర్వాత ఈడీ రంగంలోకి దిగింద‌ని ఫైర్ అయ్యారు.

ఈ ఢిల్లీ స్కాం కేసు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే మొత్తం 36 మంది ఇందులో నిందితులుగా ఉన్నార‌ని పేర్కొంది ఈడీ. ఇదే స‌మ‌యంలో మొత్తం 173 ఫోన్ల‌ను వాడార‌ని తెలిపింది.

కేవ‌లం 17 ఫోన్లు దొరికాయ‌ని ప్ర‌స్తావించి. మిగ‌తా ఫోన్ల‌ను ధ్వంసం చేశార‌ని, వాటి విలువ రూ. 1.38 కోట్లు గా ఉంద‌ని అంచ‌నా వేసింది. అవి దొరికి వుంటే మ‌రిన్ని ఆధారాలు ల‌భించి ఉండేవ‌న్నారు.

Also Read : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం సౌత్ గ్రూప్ నిర్వాకం

Leave A Reply

Your Email Id will not be published!