Liz Truss PM Race : బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్
రసవత్తరంగా మారిన రాజకీయం
Liz Truss PM Race : బ్రిటన్ లో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు పీఎంగా ఉన్న బోరీస్ జాన్సన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో బలం లేక గత్యంతరం లేని పరిస్ఙితుల్లో తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి పీఎం రేసులో బలమైన వ్యక్తిగా భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ పేరు ప్రముఖంగా ఉంది.
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అల్లుడే ఈ రిషి సునక్. బ్రిటన్ లో అత్యంత ధనవంతుల జాబితాలో ఈయన కూడా ఒకరు.
ప్రస్తుతం తాను కూడా బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో ఉన్నానంటూ ప్రకటించాడు రిషి సునక్. ఇదిలా ఉండగా పీఎం పదవి నుంచి తప్పుకున్నా బోరిస్ జాన్సన్ వెనుక నుంచి చక్రం తిప్పుతూనే ఉన్నాడు.
తాను లేక పోయినా తనకు నమ్మిన బంటును పీఎంగా చేయాలనే యోచనలో పావులు కదుపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా తాజాగా రిషి సునక్ తో పాటు ఇప్పటి వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన లిజ్ ట్రస్ (Liz Truss PM Race) సంచలన కామెంట్స్ చేశారు.
తాను కూడా పీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు. ఆమె బోరిస్ జాన్సన్ టీంలో నమ్మకమైన వ్యక్తిగా పేరొందారు. తాను బోరిస్ జాన్సన్ ను గెలిపించేందుకు శాయ శక్తులా కృషి చేస్తానంటూ వెల్లడించారు.
ప్రస్తుతం 46 ఏళ్ల వయస్సు కలిగిన లిజ్ ట్రస్ ఇప్పుడు బ్రిటన్ లో హాట్ టాపిక్ గా మారారు. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న వారి సంఖ్య 11 మందికి చేరింది.
Also Read : రిషి సునక్ కామెంట్స్ వైరల్