Liz Truss & Rishi Sunak : బ్రిటన్ పీఎం రేసులో లిజ్ ట్రస్ ముందంజ
వెనుక బడిన ప్రవాస భారతీయుడు రిషి సునక్
Liz Truss & Rishi Sunak : కేవలం మూడు రోజులు 72 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎవరు యునైటెడ్ కింగ్ డమ్ ( బ్రిటన్ )కు ప్రధానమంత్రి అవుతారన దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న లిజ్ ట్రస్(Liz Truss) తో పాటు ప్రవాస భారతీయుడైన రిషి సునక్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మొదటి నాలుగు రౌండ్లలో రిషి సునక్ టాప్ లో నిలిచారు.
కానీ రాను రాను ఆయన బ్రిటన్ల మద్దతును కూడగట్ట లేక పోయారు. ఓపినియన్ పోల్స్ లో సునక్ కంటే ముందంజలో ఉన్నారు లిజ్ ట్రస్. సెప్టెంబర్ 5న యుకె అంతిమ ఫలితం వెల్లడి కానుంది.
సోమవారం ఎవరు ప్రధాన మంత్రి అవుతారనేది తేలుతుంది. ప్రస్తుతం అంచనా కంటే భిన్నంగా ఫలితం రాబోతోంది. నిన్నటి దాకా రేసులో ఉన్న సునక్ ఉన్నట్టుండి తన మద్దతును కోల్పోవడం షాక్ కు గురి చేస్తోంది.
లిజ్ ట్రస్ ప్రస్తుతం ముందంజలో కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా రిషి సునక్, లిజ్ ట్రస్(Liz Truss & Rishi Sunak) కలిసి పర్యటించారు. డజన్ హోస్టింగ్ లు, మూడు టెలిజన్ చర్చల తర్వాత లిజ్ ట్రస్ అత్యంత ముందు వరుసలో ఉన్నారు.
ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రోజు క్వీన్ ఎలిజబెత్ -2కి అధికారికంగా తన రాజీనామాను సమర్పించారు. మొదట్లో జాన్సన్ రిషి సునక్ కు మద్దతు తెలిపారు.
కానీ ఆ తర్వాత తాను పదవి నుంచి తప్పుకునేందుకు సునక్ కారణమని ఆరోపించాడు. పనిగట్టుకుని లిజ్ ట్రస్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు.
Also Read : ప్రయోగానికి సిద్దమైన డీఆర్డీఓ మిస్సైల్