Rishi Sunak : రిషి సునక్ ను దాటేసిన లిజ్ ట్రస్
32 పాయింట్లో వెనుకంజలో ఆర్థిక మంత్రి
Rishi Sunak : భారతీయ మూలాలు కలిగిన యుకె ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో వెనుకంజలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ దిగ్గజ భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి, సుధా మూర్తికి అల్లుడు.
యుకెలో గత కొంత కాలంగా వ్యాపారవేత్తగా ఉన్నారు. అనంతరం కేబినెట్ లో కీలక మంత్రిగా పని చేశారు. కరోనా కష్ట కాలంలో మరింత పాపులర్ అయ్యారు రిషి సునక్. మొన్నటి వరకు పీఎం రేసులో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది.
విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న లిజ్ ట్రస్ ఊహించని రీతిలో దూసుకు వచ్చారు. ఆమె వైపు ఎక్కువ శాతం మంది మొగ్గు చూపడం విశేషం. నాలుగు రౌండ్లలో టాప్ లో నిలిచారు రిషి సునక్.
కానీ అనూహ్యంగా ఆయనను వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రధానంగా బ్రిటన్ మీడియా రిషిని టార్గెట్ చేసింది. అంతే కాకుండా అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్న మాజీ పీఎం బోరిస్ జాన్సన్ ఎలాగైనా రిషి సునక్(Rishi Sunak) ను రాకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు.
ఈ తరుణంలో ఒక భారతీయుడు ప్రధాన మంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం నెలకొంది. తాజాగా అందిన సమాచారం మేరకు లిజ్ ట్రస్ కంటే రిషి సునక్ 32 పాయింట్ల వెనుకంజలో ఉన్నారు.
961 మంది టోరీ సభ్యులలో 60 శాతం మంది ట్రస్ ను ఇష్ట పడితే కేవలం 28 శాతం మంది మాత్రమే రిషి సునక్ కు మద్దతు ఇవ్వడం విశేషం.
Also Read : పాక్ లో బలగాల మోహరింపుపై చైనా ఫోకస్
