Liz Truss : బ్రిట‌న్ ప్ర‌ధానిమంత్రిగా లిజ్ ట్ర‌స్ విక్ట‌రీ

ఓట‌మి పాలైన ఎన్నారై రిషి సున‌క్

Liz Truss : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని కైవ‌సం చేసుకున్నారు ఆ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్ర‌స్. క‌న్జ‌ర్వేటివ్ పార్టీ త‌ర‌పున ఇద్ద‌రు బ‌రిలో నిల‌బ‌డ్డారు.

భార‌తీయ మూలాలు క‌లిగిన రిషి సున‌క్ పై ఆమె ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న బోరిస్ జాన్స‌న్

అనూహ్యంగా అవినీతి ఆరోప‌ణల నేప‌థ్యంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి సంబంధించి ప‌లువురు పోటీ ప‌డ్డారు. చివ‌ర‌కు నాలుగు రౌండ్ల పోలింగ్ లో వ‌రుస‌గా విజ‌యం సాధిస్తూ దూకుడు పెంచారు రిషి సున‌క్.

కానీ అనుకోకుండా ఒపినియ‌న్ పోల్స్ లో వెనుక‌బ‌డి పోయాడు. అనుకోని రీతిలో లిజ్ ట్ర‌స్ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. దీంతో ఆమె బ్రిట‌న్ కు కొత్త ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీర‌నున్నారు.

త‌న‌పై విజ‌యం సాధించిన లిజ్ ట్ర‌స్ కు ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు రిషి సున‌క్. క‌న్జ‌ర్వేటివ్ రేసులో లిజ్ ట్ర‌స్(Liz Truss) కు 81,326 ఓట్లు

పోల్ అయ్యాయి. రిషి సున‌క్ కు 60,399 ఓట్లు ప‌డ్డాయి.

మొత్తం ఎల‌క్టోర‌ల్ సంఖ్య 1,72, 437 కాగా. దీంతో 82.6 శాంత మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 654 బ్యాలెట్ పేప‌ర్ల‌ను తిర‌స్క‌రించారు.

చివ‌రి వ‌ర‌కు పోటీ ఇచ్చారు భార‌త దేశానికి చెందిన రిషి సున‌క్(Rishi Sunak). ఆయ‌న ఎవ‌రో కాదు ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ‌మూర్తి అల్లుడు.

ఇదిలా ఉండ‌గా విజ‌యం సాధించిన అనంత‌రం లిజ్ ట్ర‌స్ ప్ర‌సంగించారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అదే స‌మ‌యంలో తాను ఏం చెప్పానో ముందు దానినే అమ‌లు చేస్తాన‌ని ఇందులో ఎలాంటి అనుమానం లేద‌ని ప్ర‌క‌టించారు. గ‌ట్టి పోటీ ఇచ్చిన రిషి

సున‌క్ ను కూడా ప్ర‌త్యేకంగా అభినందించారు.

Also Read : విశ్వాస ప‌రీక్ష‌లో సోరేన్ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!