Lokesh Grand Welcome : దుర్గ‌మ్మ సాక్షిగా లోకేష్ కు వెల్ క‌మ్

భారీ ఎత్తున హాజ‌రైన జ‌నం

Lokesh Grand Welcome : టీడీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ గ‌ళం ఇవాళ కృష్ణా జిల్లా లోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్బంగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ సాక్షిగా పెద్ద ఎత్తున సాద‌ర స్వాగ‌తం ప‌లికారు లోక‌ష్ కు. ఇదే స‌మ‌యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు వంగ‌వీటి రాధా కృష్ణ లోకేష్ ను క‌లుసుకున్నారు. అనంత‌రం బెజ‌వాడ న‌గ‌రంలోకి ఎంట‌ర్ అయ్యారు. దారి పొడ‌వునా గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు. దాదాపు 2 కిలోమీట‌ర్ల మేర జ‌నం స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చారు.

Lokesh Grand Welcome in Vijayawada

ఒక ర‌కంగా నారా లోకేష్(Nara Lokesh) కు ఇది సంతోషాన్ని క‌లిగించింది. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన పాద‌యాత్ర 2,500 కిలోమీట‌ర్లు పూర్త చేసుకుంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెడుతున్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని నిల‌దీస్తున్నారు.

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, ఇక తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ఎన్నిసార్లు కుట్ర‌లు, కుతంత్రాలు ప‌న్నినా త‌మ విజ‌యాన్ని జ‌గ‌న్ ఆప‌లేడ‌ని స‌వాల్ విసిరారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ కే ద‌క్కుతుంద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని మోసం చేసిన జ‌గ‌న్ కు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేష్.

Also Read : KC Venu Gopal : ఛ‌త్తీస్ గ‌డ్ లో 75 సీట్లు గెలుస్తాం

Leave A Reply

Your Email Id will not be published!