Telangana Awards : తెలంగాణ‌కు అవార్డుల పంట

నాలుగు పుర‌స్కారాలు ల‌భ్యం

Telangana Awards : ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్న వేళ తెలంగాణ రాష్ట్రానికి పుర‌స్కారాల పంట పండింది. ఏకంగా అంత‌ర్జాతీయ అవార్డులు ద‌క్క‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఎం కేసీఆర్. అందుకున్న వాటిలో తెలంగాణ స‌చివాల‌యం, యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం, పోలీస్ క‌మాండ్ కంట్రోల్ బిల్డింగ్ , దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మొజం జాహీ మార్కెట్ లు ఉన్నాయి. వీటికి ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ లండ‌న్ కు చెందిన గ్రీన్ సంస్థ వీటిని ప్ర‌తి ఏటా ప్ర‌క‌టిస్తుంది. ఈసారి ఏకంగా ప‌లు అవార్డులు అందుకోవ‌డం ప‌ట్ల కేసీఆర్ ఆనందం వ్య‌క్తం చేశారు.

కోరి తెచ్చుకున్న తెలంగాణ ప్ర‌స్తుతం అన్ని రంగాల‌లో ముందంజ‌లో కొన‌సాగుతోందన్నాడు. ఒక‌నాడు ఐటీ అంటే బెంగ‌ళూరు న‌గ‌రం ముందు చెప్పే వార‌ని కానీ ఇప్పుడు సీన్ మారింద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీల‌న్నీ ఇక్క‌డే కొలువు తీరాయ‌ని ఇది మ‌నం సాధించిన ఘ‌న‌త అని పేర్కొన్నారు కేసీఆర్(KCR). ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు మ‌నం చేప‌ట్టిన హ‌రిత హారం దేశానికే ఆద‌ర్శంగా మారింద‌ని పేర్కొన్నారు కేసీఆర్.

అభివృద్ది, సంక్షేమం ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ ఎక్క‌డా ఏ రాష్ట్రంలో లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు కేసీఆర్.

Also Read : Opposition Partys : సెంథిల్ అరెస్ట్ పై విప‌క్షాలు గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!