Looto Looto Viral : అదానీ..మోదీ ‘లూటో లూటో’ వైర‌ల్

కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్ర‌చారం

Looto Looto Viral : దేశంలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై మ‌రొక‌రు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. వ‌చ్చే ఏడాది దేశమంతటా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దానికి తెర లేచింది. ఇదే స‌మ‌యంలో అదానీ గ్రూప్ వ్య‌వ‌హారం బ‌ట్ట బ‌య‌లు అయ్యింది. దేశంలోని వ‌న‌రుల‌ను, సంప‌ద‌ను అప్ప‌నంగా గౌతం అదానీకి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అప్ప చెప్పుతున్నాడంటూ కాంగ్రెస్ గ‌త కొంత కాలం నుంచీ ఆరోపిస్తూ వ‌స్తోంది.

ఇప్ప‌టికే అదానీ గురించి ప‌లుమార్లు పార్ల‌మెంట్ సాక్షిగా ఆ పార్టీకి చెందిన అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌కు ఊతం ఇచ్చేలా ఇటీవ‌ల అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బ‌ర్గ్ సంచ‌ల‌న నివేదిక వెల్ల‌డించింది. అదానీ గ్రూప్ చెప్పిన లెక్క‌ల్లో 90 శాతానికి పైగా అన్నీ అబ‌ద్దాలే ఉన్నాయంటూ ఆరోపించింది. దీంతో అదానీ షేర్లు ఢ‌మాల్ మ‌న్నాయి. భారీ ఎత్తున న‌ష్టం వాటిల్లింది.

ప్ర‌పంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఉన్న‌ట్టుండి 23వ స్థానానికి ప‌డి పోయాడు. దీని గురించి ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తూ వ‌చ్చాడు రాహుల్ గాంధీ. ఇక సోమ‌వారం పార్ల‌మెంట్ లో ఇదే అంశానికి సంబంధించి నిల‌దీసింది కాంగ్రెస్ పార్టీ. 

దేశ వ్యాప్తంగా మోదీ, అదానీకి మ‌ధ్య ఉన్న బంధం ఏమిటో తెలియ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న బాట ప‌ట్టింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాజ‌మౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లోని ప్ర‌ముఖ సాంగ్ నాటు నాటు కు పేర‌డీగా అదానీ..మోదీ లూటో లూటో (Looto Looto Viral)  పేరుతో పోస్ట‌ర్ షేర్ చేసింది. ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : అదానీ స్కాం మోదీ మౌనం

Leave A Reply

Your Email Id will not be published!