Jyestabhishekam : ఘ‌నంగా శ్రీవారి జ్యేష్టాభిషేకం

ముత్య‌పు క‌వ‌చంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం

Jyestabhishekam : క‌లియుగ పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో నిండి పోయింది. భారీ ఎత్తున ఏర్పాట్ల‌ను చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. సెల‌వులు కావ‌డంతో భ‌క్తులు పోటెత్తారు. ఇక తిరుమ‌ల శ్రీ‌వారి జ్యేష్టాభిషేకంలో(Jyestabhishekam) భాగంగా శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారు ముత్య‌పు క‌వ‌చం ధ‌రించి నాలుగు మాడ వీధుల‌లో ఊరేగుతూ భ‌క్తుల‌ను త‌న్మ‌య‌త్వంలో ముంచెత్తారు.

అంత‌కు ముందు ఉద‌యం శ్రీ మ‌ల‌య్ప స్వామి వారు ఉభ‌య నాంచారుల‌తో క‌లిసి శ్రీ‌వారి ఆల‌యం లోని సంపంగి ప్రాకారానికి చేరుకున్నారు. 8 గంట‌ల‌కు ఆల‌య అర్చ‌కులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మ‌హా శాంతి హోమం నిర్వ‌హించారు. 9 గంట‌ల నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారికి , దేవేరుల‌కు అభిదేయ‌క అభిషేకాన్ని క‌న్నుల పండువ‌గా చేప‌ట్టారు.

సాయంత్రం శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారికి ముత్య‌పు క‌వ‌చ స‌మ‌ర్ప‌ణ అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. అనంత‌రం స‌హ‌స్ర దీపాలంకార సేవ‌లో స్వామి ముత్య‌పు క‌వ‌చంలో భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు. కాగా సంవ‌త్స‌రంలో ఒక‌సారి మాత్ర‌మే స్వామి వారు ముత్య‌పు క‌వ‌చాన్ని ధ‌రిస్తారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారిని చూసి త‌న్మ‌య‌త్వం చెందారు భ‌క్త బాంధ‌వులు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి దంప‌తులు డిప్యూటీ ఈవో పాల్గొన్నారు.

Also Read : PM Modi Visit

Leave A Reply

Your Email Id will not be published!