LS Committee Hear : మార్చి 10న రాహుల్ పై విచారణ
వాదనలు విననున్న ప్రివిలేజ్ కమిటీ
LS Committee Hear : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు కోరుతున్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, కేంద్ర సర్కార్ పై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇంత వరకు సమర్పించలేదని పేర్కొన్నారు.
వెంటనే రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు రెడీ అయ్యింది ప్రివిలేజ్ కమిటీ ఏర్పడింది. ఇందులో భాగంగా మార్చి 10న వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై విచారణ(LS Committee Hear) చేపట్టనుంది.
ఈ మేరకు హౌస్ ప్యానల్ విననుంది. తప్పు దోవ పట్టించే, అవమానకరమైన, అన్ పార్లమెంటరీ , నేరారోపణలు చేసినందుకు మాజీ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీలు పట్టుబట్టారు. రాహుల్ గాంధీ ప్రకటన సభను తప్పు దోవ పట్టించేలా ఉందని నిషి కాంత్ దూబే పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ మాజీ చీఫ్ తప్పుదోవ పట్టించేలా మాట్లాడారంటూ ఆరోపించారు.
ఇది ఎంత మాత్రం తగదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రవర్తన లేదంటూ మండిపడ్డారు. లండన్ వేదికగా కూడా భారత దేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా ఇలా కావాలని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. అంతకు ముందు మార్చి 14న సమావేశానికి సంబంధించి జార్ఖండ్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ(LS Committee Hear) నోటీసు పంపింది.
Also Read : భ్రష్టుపట్టిన పాలక వ్యవస్థపై పారాటం