LT Company : భారీ వ‌ర‌ద వ‌ల్లే మేడిగడ్డ స‌మ‌స్య

స్పందించిన ఎల్ అండ్ టీ కంపెనీ

LT Company : హైద‌రాబాద్ – కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ప్ర‌భుత్వం నిర్మించింది కాళేశ్వ‌రం ప్రాజెక్టును. దీనిని పూర్తిగా నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకుంది ఎల్ అండ్ కంపెనీ. ఇందులో భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

LT Company Issues

ఇక బీఆర్ఎస్ స‌ర్కార్, సీఎం కేసీఆర్(KCR), మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ , ప‌రివార‌మంతా కాళేశ్వ‌రం గురించి గొప్ప‌లు చెప్పారు. చివ‌ర‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంద‌ర్బంలో ఉన్న‌ట్టుండి కాళేశ్వ‌రంకు సంబంధించిన మేడిగ‌డ్డ బ్యారేజ్ కు ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌తిప‌క్షాల‌కు ఇది ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా త‌యారైంది.

ఈ త‌రుణంలో కాళేశ్వ‌రం ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు స‌ర్కార్ స్వ‌యంగా రంగంలోకి దిగింది. ఈ మేర‌కు నిర్మాణం చేప‌ట్టిన ఎల్ అండ్ టి ప్ర‌తినిధుల‌ను వివ‌ర‌ణ ఇచ్చేలా ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు వారు మీడియాతో మాట్లాడారు. భారీ వ‌ర‌ద చోటు చేసుకోవ‌డం వ‌ల్ల‌నే మేడిగ‌డ్డ బ్యారేజ్ స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి త‌ప్పిదం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

2019లో బ్యారేజీని నిర్మించామ‌ని, 2023లో వ‌చ్చిన వ‌ర‌ద‌ను కూడా త‌ట్టుకుని నిల‌బ‌డింద‌ని చెప్పారు. 28.25 ల‌క్ష‌ల క్యూసెక్కులు దీని కెపాసిటీ అని ప్ర‌స్తుతం దానికి మించి వ‌ర‌ద వ‌చ్చింద‌న్నారు.

Also Read : CM KCR Wishes : కేసీఆర్ ద‌స‌రా శుభాకాంక్ష‌లు

Leave A Reply

Your Email Id will not be published!