LT Gen Manoj Pande : మేజర్ జనరల్ నరవాణే స్థానంలో భారత (త్రివిధ దళాధిపతి) ఆర్మీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టారు మనోజ్ పాండే(LT Gen Manoj Pande). సందర్బంగా ఆయన డ్రాగన్ చైనాపై నిప్పులు చెరిగారు.
భారత్ శాంతి కోరుకుంటుందని, కానీ ఇదే సమయంలో తమ సరిహద్దులలో జోక్యం చేసుకోవాలని చూసినా లేదా లక్ష్మణ రేఖ దాటితే కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తనకు దేశ రక్షణమే ముఖ్యమని స్పష్టం చస్త్రశారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని అది పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ , చైనాకే కాదు ఈ ప్రపంచానికి తెలియ చేస్తున్నామన్నారు.
ఆయన ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆర్మీ చీఫ్ లు మెతక వైఖరిని అవలంభించారు. కానీ మనోజ్ పాండే(LT Gen Manoj Pande) గతంలో ఎల్ఓసీ వద్ద ఆర్మీకి ప్రాతినిధ్యం వహించారు.
ఆయనకు అడుగడుగునా ఈ దేశం పట్ల అవగాహన ఉంది. అందుకే ఆయన కొలువు తీరాక చైనా, పాకిస్తాన్ దేశాలు ఓ వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకు యత్నించడం విశేషం.
దూకుడుగా వ్యవహరించే నాయకుడిగా పేరొందారు. కొత్తగా పదవి చేపట్టిన మనోజ్ పాండే గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ పాండే మాట్లాడారు.
భారత్, చైనాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అలా అని ముందుకు వస్తానంటూ ఊరుకునే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. ఎల్ఓసీ వేదికగా తప్పుడు చర్యలకు పాల్పడితే సహించ బోమన్నారు.
యథాతథ స్థితికి వ్యతిరేకంగా ఏం చేసినా ఊరుకోబోమన్నారు. అలాగే బారత దేశానికి సంబంధించి ఒక్క ఇంచు భూమిని కూడా వదులుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు మనోజ్ పాండే.
Also Read : షావోమీ 10 కోట్ల విరాళంపై మహూవా ఫైర్