Luna-25 Rocket : జాబిల్లి వద్దకు రష్యా రాకెట్
లూనా 25 పేరు పెట్టిన రష్యా
Luna-25 Rocket : ఓ వైపు యుద్ద వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా ఎక్కడా తగ్గడం లేదు. ముందు నుంచీ అంతిరక్ష రంగంపై వారికి పట్టుంది. గగారిన్ తొలి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి కావడం విశేషం. తాజాగా లూనా 25 పేరుతో రాకెట్ ను ప్రయోగించింది. సుదీర్ఘ కాలం తర్వాత చేపట్టిన ప్రయోగం ఇది. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే.
Luna-25 Rocket Launch from Russia
ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్ కాస్మోస్ చిత్రాలు విడుదల చేసింది. దీని ప్రకారం మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వాస్తోక్నీ కాస్కోడ్రోమ్ ప్రాంతం నుంచి శుక్రవారం తెల్ల వారుజామున 2.10 గంటలకు లునా 25(Luna-25 Rocket) నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుందని రష్యా వెల్లడించింది.
జాబిల్లిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్ ను దిగేలా ప్రయోగం చేపట్టారు. అన్ని అనుకూలంగా జరిగితే ఆగస్టు 21న ఈ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టనున్నట్లు రోస్ కాస్కోస్ అధికారులు తెలిపారు.
Also Read : TSRTC MD Sajjanar : ప్రయాణీకులకు ప్రత్యేక బస్సులు – ఎండీ