Madhu Yashki Goud : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కూడా సీఎం పదవి రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీలో సీఎం పదవిపై పలువురు కన్నేశారు. వారిలో చాలా మంది క్యూలో ఉన్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా తానే సీఎం నంటూ ప్రకటిస్తున్నారు. ఏకంగా సంతకాల సంగతి కూడా చెప్పేస్తున్నారు.
Madhu Yashki Goud Comment
ఇది పక్కన పెడితే సీఎం పదవికి పోటీ పడే వారిలో తాను కూడా ఉంటానని చెప్పకనే చెప్పారు మధు యాష్కి గౌడ్(Madhu Yashki Goud). ఆయన గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కంటే ఉద్యమకారులుగా గుర్తింపు పొందారు తనతో పాటు పొన్నం ప్రభాకర్. ఆనాడు ఉమ్మడి ఏపీ నేతలతో వీరు ఘర్షణ పడ్డారు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్ తో జరిగిన కీలక ముచ్చటలో మధు యాష్కి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇంకా పవర్ లోకి రానేలేదు. టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఈ తరుణంలో సీఎం ముచ్చట మళ్లీ మొదటికొచ్చింది.
రేవంత్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, మల్లు భట్టి విక్రమార్క,
Also Read : Venkaiah Naidu : ఉచిత హామీలకు నేను వ్యతిరేకం