Madhu Yashki : బహుజన వీరుడు సర్వాయి పాపన్న
నివాళులు అర్పించిన మధుయాష్కి
Madhu Yashki : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి(Madhu Yashki) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను స్మరించుకున్నారు. ఇవాళ ఆయన జయంతి . ఈ సందర్బంగా శుక్రవారం గాంధీ భవన్ లో సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
Madhu Yashki Remembered
ఇదిలా ఉండగా సర్వాయి పాపన్నది ఘనమైన చరిత్ర. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ స్వస్థలం. 1710లో మరణించారు. గౌడ వృత్తి. స్వంతంగా గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు. ప్రత్యేకంగా ఓ రాజ్యాన్నే స్థాపించిన వీరుడు. ఆగస్టు 18న 1650లో గౌడ కులంలో పుట్టాడు. చిన్నతనంలో పశువులను కాశాడు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించాడు. తన వారిపై దాడి చేసిన తురుష్క సైనికులను తుద ముట్టించాడు సర్వాయి పాపన్న. తురుష్క రాజ్యంలో విప్లవ కారుడయ్యాడు.
ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు సమకూర్చుకున్నాడు. పేద వారిని ఆదుకున్నాడు. దీంతో జనగాం జిల్లాలో పాపన్న పేరు మారుమ్రోగింది. ఆయన సారథ్యంలో యువకులు సైనికులుగా చేరారు. 3, 000 మందిని స్వంత సైన్యం తయారు చేసిన ఘనత సర్వాయి పాపన్నది. భువనగిరి కోటపై తిరుగుబాటు జెండా పాతాడు. ఖిలాషాపూర్ ను రాజధానిగా చేసుకుని 1675లో రాజ్యాన్ని స్థాపించాడు. పాపన్న శివాజీకి సమకాలీకుడు.
20 కోటలను స్వాధీనం చేసుకున్నాడు. చివరకు గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకున్నాడు. మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది పాపన్నే.1708 ఏప్రిల్ 1న పాపన్న పట్టుబడ్డాడు. శత్రువు చేతిలో చావడం ఇష్టంలేక తన బాకుతోనే తాను పొడుచుకుని చని పోయాడు. 1710లో పాపన్న తలని గోల్కొండ కోట ముఖ ద్వారానికి వేలాడ దీశారు.
Also Read : CM KCR Focus : ఎమ్మెల్యేల జాబితాపై బాస్ ఫోకస్