Priyanka Gandhi : త్యాగ‌ధ‌నుల‌కు పుట్టినిల్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్

ఎంద‌రో మ‌హిళ‌లు అంద‌రికీ వంద‌నాలు

Priyanka Gandhi : ఎంద‌రో ఈ నేల‌పై పుట్టారు. త‌మ జీవితాల‌ను త్యాగం చేశారు. ఆద‌ర్శ ప్రాయంగా నిలిచారు. వారంద‌రినీ గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఇప్పుడు ఎంతైనా ఉంద‌న్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ. సోమ‌వారం మ‌ధ్య ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పూజ‌లు చేసిన అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

జ‌బ‌ల్పూర్ భూమిని సంస్కార్థాని అంటార‌ని కొనియాడారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో స‌త్యం కోసం పోరాడి గ‌ర్వ ప‌డేలా చేసిన మ‌హిళ‌లు ఎంద‌రో ఉన్నార‌ని గుర్తు చేశారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). వారంద‌రిలో ఇప్ప‌టికీ త‌రాలు మారినా ఇంకా గుర్తు చేసుకుంటున్నామ‌ని చెప్పారు. రాణి దుర్గావ‌తి, రాణి అహ‌ల్యా బాయి , రాణి అవంతీబాయి లాంటి మ‌హ‌నీయులైన వారు ఇక్క‌డ పుట్టార‌ని, ఇది ఈ నేల చేసుకున్న అదృష్ట‌మ‌ని ప్ర‌శంసించారు ప్రియాంక గాంధీ.

వీరుల‌ను, త్యాగ‌ధ‌నుల‌ను, స్పూర్తి దాయ‌కంగా నిలిచే మ‌హ‌నీయుల‌ను క‌లిగి ఉన్న ఈ ప‌విత్ర భూమి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు. స‌త్యం ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటుంద‌ని, దానిని అస‌త్యంగా మార్చాల‌ని కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. కానీ జ‌నం మార్పును కోరుకుంటున్నార‌ని , ఈ నేల సాక్షిగా అబ‌ద్దాలు ఎల్ల‌కాలం ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు ప్రియాంక గాంధీ.

Also Read : M Venkaiah Naidu : ప్ర‌జ‌లే ఖ‌ర్చు పెట్టి గెలిపించారు – వెంక‌య్య‌

 

Leave A Reply

Your Email Id will not be published!