Magunta Raghava : మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ హైకోర్టు
Magunta Raghava : ఏపీలో లిక్కర్ డాన్ గా పేరు పొందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Srinivasulu Reddy) తనయుడు మాగుంట రాఘవకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన ఎమ్మెల్సీ కవితతో కలిసి వ్యాపారాలు చేశాడని, ఢిల్లీలో చక్రం తిప్పినట్లు విమర్శలు కూడా వచ్చాయి. విచిత్రం ఏమిటంటే కవితను అరెస్ట్ చేయలేదు . ఆప్ కు చెందిన డిప్యూటీ సీఎం సిసోడియా కూడా ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
Magunta Raghava Case
తాజాగా తనకు అనారోగ్యం ఉందని, వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు మాగుంట రాఘవ. ఈ మేరకు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు వెసులుబాటు కల్పించేందుకు ఒప్పుకుంది.
ఇదిలా ఉండగా మాగుంట రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అడ్డు చెప్పక పోవడం విస్తు పోయేలా చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇస్తే వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈడీ. కానీ ఇవాళ మాత్రం ఎందుకు వ్యతిరేకించ లేదనేది తెలియాల్సి ఉంది. దీనిపై సమాధానం చెప్పేందుకు ఈడీ అధికారులు లేరు. మరో వైపు ఈడీ కేసులో త్వరలో అప్రూవర్ గా మారనున్న దినేష్ అరోరా.
Also Read : Rahul Gandhi Case : 21న రాహుల్ పిటిషన్ పై విచారణ
