Mahankali Bonalu Jatara : మ‌హంకాళి బోనాల జాత‌ర షురూ

బోనం స‌మ‌ర్పించిన త‌ల‌సాని

Mahankali Bonalu Jatara : సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. జాత‌ర ఉత్స‌వంలో భాగంగా అమ్మ వారికి తొలి బోనం స‌మ‌ర్పించారు రాష్ట్ర ప‌శు సంవ‌ర్ద‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. ఈ సంద‌ర్బంగా మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు పండితులు. బోనంతో వ‌చ్చే భ‌క్తుల‌కు అమ్మ వారి 20 నిమిషాల్లో ద‌ర్శ‌నం క‌లిగేలా శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌య పాల‌క మండ‌లి ఏర్పాట్లు చేసింది. భారీగా వ‌చ్చే భ‌క్తుల‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాలు(Bonalu) ప్ర‌తి ఏటా జూలై నెల‌లో ప్రారంభం అవుతాయి. ఈ శ‌క్తివంత‌మైన ఆల‌యాన్ని 17వ శ‌తాబ్దంలో నిర్మించారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో అత్యంత పురాత‌న‌మైన , విశిష్ట‌మైన ఆల‌యాల్లో శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ వారి గుడి ఒక‌టిగా పేరు పొందింది. ప్ర‌తి రోజూ మ‌హంకాళి అమ్మ వారికి ఆరాధన చేప‌డ‌తారు. ఆషాడ జాత‌ర‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు.

ఈ దేవాల‌యం ప్ర‌త్యేకంగా బోనాలు పండుగ‌కు ప్ర‌సిద్ది చెందింది. ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ వారికి స‌మ‌ర్పించిన బంగారు బోనంతో పాటు 1008 బోనాలు కూడా స‌మర్పించ‌డం ఆనవాయితీగా వ‌స్తోంది.

Also Read : KTR Modi : ర‌ఘునంద‌న్ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణేది

Leave A Reply

Your Email Id will not be published!