Maharashtra Assembly : లోకాయుక్త బిల్లుకు మ‌రాఠా ఆమోదం

బిల్లు చారిత్రాత్మ‌క‌మ‌న్న షిండే..ఫ‌డ్న‌వీస్

Maharashtra Assembly : మ‌హారాష్ట్ర శాస‌న స‌భ లోకాయుక్త బిల్లును ఆమోదించింది. గ‌త వారం రోజుల నుంచి అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర మ‌ధ్య నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదానికి సంబంధించి కూడా తీర్మానం చేసింది. ఇదిలా ఉండ‌గా లోకాయుక్త బిల్లును ఆమోదించ‌డం చారిత్రాత్మ‌క ఘ‌ట్టంగా అభివ‌ర్ణించారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్.

కాగా సీఎం, మంత్రుల మండ‌లిని అవినీతి నిరోధ‌క అంబుడ్స్ మ‌న్ ప‌రిధిలోకి తీసుకు వ‌చ్చేందుకు లోకాయుక్త బిల్లు 2022ను తీసుకు వ‌చ్చింది. ఇవాళ దానిని ఆమోదించింది. అయితే టీచ‌ర్ల ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు శివ‌సేన బాల్ ఠాక్రే, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాయ్ కాట్ చేశారు.

దీంతో ప్ర‌తిప‌క్షాలు లేకుండానే లోకాయుక్త బిల్లును అసెంబ్లీ(Maharashtra Assembly) ఆమోదించిన‌ట్లు ప్ర‌క‌టించారు మ‌రాఠా స్పీక‌ర్. కాగా ఇటువంటి చ‌ట్టాన్ని క‌లిగి ఉన్న మొద‌టి రాష్ట్రంగా మ‌హారాష్ట్ర నిలిచింద‌న్నారు సీఎం ఏక్ నాథ్ షిండే. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి ప్ర‌తిప‌క్షాలు. త‌మ‌ను మాట్లాడ‌నీయ‌కుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు స‌భ్యులు.

ప్ర‌తిపక్షాలు కావాల‌ని రాద్దాంతం చేస్తున్నాయ‌ని, స‌భ్యుల మ‌ద్ద‌తుతోనే లోకాయుక్త బిల్లును ఆమోదించ‌డం జరిగింద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం షిండే. ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దు వివాదం త‌ల‌నొప్పిగా మారింది షిండే , బీజేపీ సర్కార్ కు. ఒక్క అంగుళం భూమిని తాము వ‌దులుకునే ప్ర‌స‌క్తి లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

లోకాయుక్త బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం స‌భ్యుల‌లో మూడింట రెండు వంతుల మంది స‌భ్యుల ఆమోదం ఉండాల‌నే నిబంధ‌న ఉంది.

Also Read : రావ‌ణాసురుడి బాట‌లో బీజేపీ – ఖుర్షీద్

Leave A Reply

Your Email Id will not be published!