Maharashtra Bus Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
25 మంది సజీవ దహనం
Maharashtra Bus Accident : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్ ప్రెస్ వే పై బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న 25 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. పూణేకు వెళుతున్న బస్సులో కనీసం 33 మంది ఉన్నారని సమాచారం. శనివారం తెల్ల వారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు చిన్నారులు సైతం మృతి చెందారు.
పూణేకు వెళుతుండగా అర్ధరాత్రి 1.30 గంటలకు సమృద్ది మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వే పై ఈ ఘటన చోటు చసేఉకుంది. బస్సు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. మంటలు రాజుకున్నాయి. టైర్లు పగిలి పోయాయి. కాగా ఈ ఘోర దుర్ఘటనలో(Maharashtra Bus Accident) బస్సు డ్రైవర్ బతికి బయట పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు బుల్దానా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ కడసానే వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. మృత దేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు తెలియ చేస్తామని తెలిపారు ఎస్పీ.
ఇదిలా ఉండగా ప్రమాద ఘటన జరిగిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు శాంతి చేకూరాలని కోరారు. సీఎం షిండే స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు
Also Read : PM Modi : వైద్యుల పాత్ర అత్యంత కీలకం – మోదీ
