Ekanth Shinde Win : షిండే సర్కార్ బన్ గయా షాన్ దార్
బలపరీక్షలో నెగ్గిన ప్రభుత్వం
Ekanth Shinde Win : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కొలువు తీరిన మంత్రి ఏక్ నాథ్ షిండే(Ekanth Shinde) శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండా ఎత్తారు.
ఆపై నాటకీయ పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ఊహించని రీతిలో మరాఠా పీఠంపై సీఎంగా కొలువు తీరారు. ఒకప్పుడు ఆటోరిక్షా నడిపిన ఈ ఆటో డ్రైవర్ ఇప్పుడు భారత దేశ ఆర్థిక రాజధానికి దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు.
ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎత్తడంతో ఎంవీఏ సర్కార్ మైనార్టీలో పడింది. దీంతో రాష్ట్ర గవర్నర్ కోషియార్ బలపరీక్షకు సిద్దం కావాలని అప్పటి సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఆదేశించారు.
కానీ సరైన బలం లేక పోవడంతో ఠాక్రే తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించు కోవాలని ఆదేశించారు గవర్నర్.
ఈ మేరకు సోమవారం ముహూర్తం ఖరారు చేశారు. అంతకు ముందు ఆదివారం డిప్యూటీ స్పీకర్ మాత్రమే కొలువు తీరిన అసెంబ్లీలో కొత్తగా భారతీయ జనతా పార్టీకి చెందిన నార్వేకర్ కొత్తగా స్పీకర్ గా ఎన్నికయ్యారు.
ఇవాళ జరిగిన బలపరీక్షలో ఏక్ నాథ్ షిండే(Ekanth Shinde Win) ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. ఈ బలపరీక్షలో ఏక్ నాథ్ షిండే గెలుపొందారు. కొత్తగగా కొలువు తీరిన శివసేన – భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఏకంగా 164 ఎమ్మెల్యేల మద్దతు లభించింది.
అంతకు ముందు సీఎం ఏక్ నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ గుర్తించారు. చీఫ్ విప్ గా తిరుగుబాటు నేత భరత్ గొగొవాలేను నియమించారు.
Also Read : లోయలో పడ్డ బస్సు 16 మంది మృతి