CM Bommai : మరాఠా మంత్రులూ రావద్దు – సీఎం బొమ్మై
వస్తే అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని ప్రకటన
CM Bommai : మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న తరుణంలో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై(CM Bommai) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు చెందిన మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్ ఈనెల 6న మంగళవారం కర్ణాటక లోని బెలగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
ఈ సందర్బంగా సరిహద్దు వివాదంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. అందుకని తమ మంత్రులు ఇద్దరని బెలగావికి పంపించవద్దని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను సీఎం బస్వరాజ్ బొమ్మై కోరారు.
సోమవారం సీఎం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రతో సరిహద్దు వివాదం ఇప్పటికైతే సద్దు మణిగిందన్నారు. ఒకవేళ పర్యటనకు వస్తే గనుక తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని స్పష్టం చేశారు సీఎం. సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. ఎలాంటి చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకైనా వెనుకాడేది లేదంటూ స్పష్టం చేశారు బొమ్మై(CM Bommai).
మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకలో పర్యటిస్తారని చెప్పినప్పుడు తమ చీఫ్ సెక్రటరీ మహారాష్ట్ర సీఎస్ కు లేఖ కూడా రాశారని తెలిపారు సీఎం. ప్రస్తుత వాతావరణంలో వారు రాకుండా ఉండడమే మేలని పేర్కొన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు బొమ్మై.
హుబ్బళ్లిలో సీఎం మాట్లాడారు. కర్ణాటక, మరాఠా ప్రజల మధ్య సామరస్యం ఉంది. ఇదే సమయంలో సరిహద్దు వివాదం కూడా ఉంది. మహారాష్ట్ర పదే పదే ఈ సమస్యను లేవనెత్తుతోందని ఆరోపించారు.
Also Read : యోగి ప్రభుత్వం అధికార దుర్వినియోగం