Rebel Mla’s Returns : రేపే ముహూర్తం బల పరీక్షకు సిద్దం
మరాఠాకు చేరుకున్న రెబల్ ఎమ్మెల్యేలు
Rebel Mla’s Returns : గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెర లేపిన మహారాష్ట్రలో ధిక్కార స్వరం ప్రకటించిన ఏక్ నాథ్ షిండే అనూహ్యంగా సీఎం పీఠంపై కొలువు తీరారు.
గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెర వెనుక నుంచి చక్రం తిప్పారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చారు.
చివరి క్షణం దాకా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని అనుకున్నారంతా. కానీ బీజేపీ హైకమాండ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఒక రకంగా ప్రమోషన్ ఇస్తారని అనుకున్నారంతా.
కానీ డిమోషన్ ఇచ్చింది ఫడ్నవీస్ కు . షిండేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చో బెట్టింది. ఫడ్నవీస్ కు డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసింది.
మరో వైపు శివసేన పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఎన్సీపీకి చెందిన డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై కోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ఈనెల 12వ తేదీ వరకు ఎమ్మెల్యేలపై(Rebel Mla’s Returns) ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. ఇవాళ స్పీకర్
పదవి కోసం బీజేపీ నుంచి ఒకరు , మహా వికాస్ అఘాడి నుంచి మరొకరు బరిలో ఉన్నారు.
ఈనెల 4న సోమవారం బల పరీక్షకు సిద్దం కావాలని గవర్నర్ కోషియార్ ఆదేశించారు. దీంతో రేపటికి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది అసెంబ్లీ కార్యదర్శి.
ఇదిలా ఉండగా ఒడిశా లోని గౌహతిలో మకాం వేసిన రెబల్ అక్కడి నుంచి గోవాకు మకాం మార్చారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎమ్మెల్యేలు వాహనంలో ముంబైకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీఎంగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే వారికి స్వాగతం పలికారు. నిన్న రాత్రే చేరుకున్నారు. ఇదిలా ఉండగా శివసేన పార్టీ చీఫ్ ,
మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తప్పు పట్టారు. కోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు.
Also Read : నామా నాగేశ్వర్ రావుకు ఈడీ ఝలక్