Maharashtra Resolution : స‌రిహ‌ద్దు వివాదం ‘మ‌రాఠా’ తీర్మానం

అంగుళం స్థ‌లం వ‌దులుకోమ‌న్న మ‌రాఠా

Maharashtra Resolution : క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర వివాదం మ‌ళ్లీ మొదటికి వ‌చ్చింది. ఇరు రాష్ట్రాలు నువ్వా నేనా అంటూ మాట‌ల తూటాలు పేలుతున్నాయి. 

ఇప్ప‌టికే రెండు ప్రాంతాల విష‌యంలో మంకుప‌ట్టు వీడడం లేదు. విచిత్రం ఏమిటంటే రెండు రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీకి చెందిన ప్ర‌భుత్వాలు కొలువు తీరి ఉన్నాయి. అయితే త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీ కావాల‌ని ఈ స‌రిహ‌ద్దు వివాదాన్ని రాజేస్తోందంటూ విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి

ఇక అంగుళం స్థ‌లం వ‌దులుకునే ప్ర‌సక్తి లేదంటున్నారు మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే. ఇక అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు గ‌త వారం ప్రారంభ‌మ‌య్యాయి. క‌ర్ణాట‌క తీర్మానం చెల్ల‌ద‌ని , ఆ ప్రాంతాల‌న్నీ మ‌రాఠా భూభాగానికి చెందిన‌వంటూ తీర్మానం చేసింది షిండే, బీజేపీ ప్ర‌భుత్వం(Maharashtra Resolution).

అంత‌కు ముందు క‌ర్ణాట‌క‌తో చెల రేగుతున్న వివాదం మ‌ధ్య సీఎం షిండే మంగ‌ళ‌వారం రాష్ట్ర అసెంబ్లీలో ద‌శాబ్దాల నాటి స‌రిహ‌ద్దు వివాదంపై తీర్మానాన్ని స‌మ‌ర్పించారు.

బెల్గావి, కార్వార్, నిపాని, బీద‌ర్ బాల్కీ స‌హా 865 గ్రామాల్లోని ప్ర‌తి అంగుళాన్ని కూడా కోల్పోయేందుకు ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు సుప్రీంకోర్టులో తాము జ‌రిగిన అన్యాయంపై పోరాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు ఏక్ నాథ్ షిండే.

కాగా అంత‌కు ముందు శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వినూత్న నిర‌స‌న తెలిపారు. వారు జాన‌ప‌ద గేయాల‌తో హోరెత్తించారు. ముందు స‌రిహ‌ద్దు వివాదం తేల్చాల‌ని కోరారు.

అవ‌స‌ర‌మైతే ప్ర‌త్య‌క్ష యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

Also Read : చరిత్ర వ‌క్రీక‌ర‌ణ‌ దేశానికి ప్ర‌మాదం – స్టాలిన్

Leave A Reply

Your Email Id will not be published!