Maharastra Speaker : మ‌రాఠా స్పీక‌ర్ రేసులో రాజ‌న్..రాహుల్

ఎంవిఏ నుంచి సాల్విని..బీజేపీ నుంచి న‌ర్వేక‌ర్

Maharastra Speaker : మ‌హారాష్ట్రలో కొలువు తీరిన షిండే ప్ర‌భుత్వం త‌న బ‌లాన్ని నిరూపించు కునేందుకు సోమ‌వారం వేదిక కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీ స్పీక‌ర్ ప‌ద‌వి ఖాళీగా ఉంది డిప్యూటీ స్పీక‌ర్ గా శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని నేష‌నలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్య‌ర్థి ఉన్నారు.

తాజాగా స్పీక‌ర్ ప‌ద‌వి ఖాళీగా ఉండ‌డంతో దాని కోసం ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉండ‌గా శాస‌న‌స‌భ స‌భాప‌తి ప‌ద‌వి కోసం మ‌హా వికాస్ అఘాడీ (శివ‌సేన‌,ఎన్సీపీ, కాంగ్రెస్ ) ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా శివ‌సేన పార్టీకి చెందిన రాజ‌న్ సాల్విని రంగంలోకి దింపింది.

ఇక తొలిసారిగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన శాస‌న స‌భ్యుడు రాహుల్ న‌ర్వేక‌ర్ షిండే స‌ర్కార్ నుంచి ఈ ప‌ద‌వి కోసం నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

స్పీక‌ర్ ప‌ద‌వికి సంబంధించి నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు గ‌డువు నిర్ణ‌యించారు. దీంతో బీజేపీ, శివ‌సేన పార్టీల అభ్య‌ర్థుల మ‌ధ్య మ‌రోసారి ర‌స‌వ‌త్త‌ర‌మైన పోరు సాగ‌నుంది.

ఇక బీజేపీకి చెందిన నార్వేక‌ర్ ముంబైలోని కొలాబా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా శివ‌సేన పార్టీకి చెందిన సాల్వి ర‌త్న‌గిరి జిల్లా లోని రాజాపూర్ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇదిలా ఉండ‌గా కొత్త‌గా కొలువుతీరిన ప్ర‌భుత్వం జూలై 3, 4న రెండు రోజుల పాటు ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం స్పీక‌ర్ కోసం ఎన్నిక(Maharastra Speaker) జ‌ర‌గ‌నుంది.

ప్ర‌స్తుతానికి షిండే సీఎం కాగా , ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు. మ‌రుస‌టి రోజు బ‌ల నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read : ఢిల్లీ పోలీస్ తీరుపై ‘సుప్రీం’ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!