CM KCR : మహాత్ముడి జీవితం ఆదర్శప్రాయం – కేసీఆర్
గాంధీ ఆస్పత్రిలో గాంధీ విగ్రహావిష్కరణ
CM KCR : జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆదర్శ ప్రాయమన్నారు సీఎం కేసీఆర్(CM KCR). గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. కరోనా కష్ట కాలంలో గాంధీజీ అందించిన స్పూర్తితో బాధితులకు వైద్య సాయం అందించడం జరిగిందన్నారు కేసీఆర్. గాంధీ ఆస్పత్రికి ఉన్న పేరును మరింత నిలబెట్టేందుకు సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పేరు పేరునా తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు కేసీఆర్. వసతులు లేకున్నా పీపీ కిట్స్ ఉన్నా లేక పోయినా చాలా ధైర్యంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు సీఎం.
ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా సమయంలో తీసుకోక పోతే వారిని చేర్చుకుని సేవలు అందించిన ఘనత మీకే దక్కుతుందన్నారు కేసీఆర్. గాంధీజీ జీవితం ఆదర్శ ప్రాయమన్నారు.
ఆయన జీవితమే సందేశమని పేర్కొన్నారు. మహాత్ముడి స్పూర్తితో ఎందరో విధులు నిర్వహించారని వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు సీఎం.
గాంధీ ప్రబోధించిన శాంతి, సహనం, ప్రేమ, సేవ ఎల్లప్పటికీ ప్రపంచంలో ఆచరణీయంగా ఉంటాయని స్పష్టం చేశారు కేసీఆర్. సమస్త మానవాళికి గాంధీజీ అంటే ఎంతో అభిమానమన్నారు.
మహాత్ముడి ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు కేసీఆర్(CM KCR). మహాత్ముని ప్రవచనం, సిద్దాంతం ఏనాటికైనా విశ్వజనీనం, సార్వ జనీనం, శాశ్వతం. దాన్ని ఎవరూ తుడిచి వేయలేరన్నారు సీఎం.
గౌతమ బుద్దుడు, ఏసు క్రీస్తుల కోవలో ప్రపంచాన్ని అహింసా సిద్దాంతంతో ప్రభావితం చేసిన యుగ పురుషుడు గాంధీ అని కితాబు ఇచ్చారు కేసీఆర్.
Also Read : గాంధీని చంపిన సిద్ధాంతంతో యుద్ధం – రాహుల్