Sarkaru Vaari Paata : ‘మ‌హేష్..కీర్తి’ పోస్ట‌ర్ సూప‌ర్

నెట్టింట్లోవైర‌ల్ గా మారిన క‌ళావ‌తి

Sarkaru Vaari Paata  : ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన సర్కార్ వారి పాట‌పై (Sarkaru Vaari Paata )భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక ఈ మూవీకి ఆగ‌డు త‌ర్వాత ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఆయ‌న ఇటీవ‌ల మ్యూజిక్ చేసిన అఖండ దుమ్ము రేపింది. సంక్రాంతికి రిలీజ్ చేస్తార‌ని అనుకున్నారు ఈ చిత్రాన్ని.

కానీ మే 12న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. ఇక మ‌హేష్ కు సంబంధించిన పాట‌ల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈనెల 14న వాలంటైన్స్ డే సంద‌ర్భంగా మొద‌టి సాంగ్ ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్ర పేరు క‌ళావ‌తి అని టాక్. ఆ పాత్ర పేరుతోనే ఫ‌స్ట్ సింగిల్ ఉండ‌నుంద‌ని ఇవాళ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ను చూస్తే తెలుస్తుంది.

ఇది క‌చ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు చిత్ర ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్. త‌మ‌న్ అందించిన ఈ పాటతో ప్రేమికులు క‌చ్చితంగా ల‌వ్ లో ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు.

దీనికి సంబంధించి తాజాగా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కీర్తి భుజంపై వాలి పోయిన మ‌హేష్ బాబు ఫీలింగ్స్ ను వ్య‌క్త ప‌రిచేలా ఉంది.

ఈ పోస్ట‌ర్ లో ప్రిన్స్ సూప‌ర్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. కీర్తి చీర‌లో మెస్మ‌రైజ్ చేసేలా ఉంది.

Also Read : శంక‌ర్..చెర్రీ’ మూవీ క‌థ నాదే

Leave A Reply

Your Email Id will not be published!