Mahua Moitra : బీజేపీ ఎంపీల తీరుపై మహూవా ఫైర్
దాడికి దిగుతున్నారంటూ ఆగ్రహం
Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు అంతా తామై వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
సోనియా గాంధీ విషయంలో వారంత మరింత దూకుడుగా ప్రవర్తించారంటూ మండి పడింది. ఆదివారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
అసలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహూవా మోయిత్రా. బీజేపీ తాను చేసిన తప్పుల గురించి మాట్లాడడం లేదన్నారు.
కానీ ప్రతిపక్షాలను మాత్రం అదే పనిగా టార్గెట్ చేస్తూ వస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సభ సజావుగా సాగాలంటే అందరికీ సమాన అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, ఆ విషయం మీకు తెలుసని పేర్కొన్నారు మహూవా మోయిత్రా(Mahua Moitra).
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కావాలని నోరు జారలేదని , కానీ దానిని పెద్ద రాద్దాంతం చేశారంటూ ఆరోపించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలలో ద్రౌపది ముర్ము పేరును ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు తనకు కనిపించ లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద ప్రజాస్వామ్యానికి పాతర వేశారంటూ నిప్పులు చెరిగారు ఎంపీ.
ఇదిలా ఉండగా గుజరాత్ ఎమ్మెల్యేపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ప్రధాన మంత్రి మోదీ ఎందుకు మాట్లాడడం లేదని మహూవా ప్రశ్నించారు.
సోనియా గాంధీ విషయంలో తన పరిధి దాటి ప్రవర్తించిందంటూ స్మృతీ ఇరానీ పై మండిపడింది.
Also Read : శివసేనను వీడను చచ్చినా లొంగను – రౌత్