Mahua Moitra : దేవుళ్లు బీజేపీకి చెందిన వారు కారు

నిప్పులు చెరిగిన ఎంపీ మ‌హూవా మోయిత్రా

Mahua Moitra : కాళీ దేవిని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశారంటూ బీజేపీ టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రాను టార్గెట్ చేసింది. ఇదే స‌మ‌యంలో బెంగాల్ లో కేసు కూడా న‌మోదైంది.

ఇక అధికారిక టీఎంసీ పార్టీ త‌మ పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా చేసిన కామెంట్ల‌తో త‌మ‌కు సంబంధం లేదంటూ ట్వీట్ చేసింది. ఈ త‌రుణంలో మ‌హూవా మోయిత్రా నిప్పులు చెరిగింది.

త‌న‌పై ఎన్ని కేసులు పెట్టినా తాను బెద‌రంటూ పేర్కొంది. తాజాగా భార‌త దేశంలో హిందూ మ‌తం, దేవుళ్లు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన వారు కాద‌ని స్ప‌ష్టం చేసింది ఎంపీ.

అంతే కాకుండా అస్సాం సీఎంను టార్గెట్ చేసింది. కామాఖ్య‌లో ఎలాంటి నైవేద్యాలు ఇచ్చారో వివరించ గ‌ల‌రా అంటూ నిల‌దీశాయి. బీజేపీ హిందూ మ‌తానికి సంర‌క్ష‌కుడు కాద‌న్నారు.

రాముడు లేదా హ‌నుమంతుడు బీజేపీకి చెందిన వార‌నుకోవ‌డం భ్ర‌మ అని పేర్కొన్నారు మ‌హూవా మోయిత్రా. కాళీ దేవిని ఎలా పూజించాలో బెంగాలీల‌కు నేర్పించే హ‌క్కు ఆ పార్టీకి లేద‌న్నారు ఎంపీ.

బీజేపీ పాలిత రాష్ట్రాల లోని ఇత‌ర రాష్ట్రాల సీఎంలు అక్క‌డి ఆల‌యాల్లో కాళికి స‌మ‌ర్పించే నైవేద‌యాల విష‌యంలో కూడా ఇలాగే చేయ‌గ‌ల‌రా అంటూ నిప్పులు చెరిగారు మ‌హూవా మోయిత్రా(Mahua Moitra). న‌న్ను మ‌ట్టుబెట్టాల‌ని బీజేపీ అనుకుంటోంది.

కానీ ఆ పార్టీ పన్నాగాలు నా వ‌ద్ద ప‌ని చేయ‌వ‌న్నారు ఎంపీ. ఎఫ్ఐఆర్ లు న‌మోదైన రాష్ట్రాల్లోని బీజేపీ ప్ర‌భుత్వాలు కాళీ దేవికి స‌మ‌ర్పించే నైవేద్యాల గురించి కోర్టుకు అఫిడ‌విట్ లో లిఖిత పూర్వ‌కంగా ఇవ్వాల‌ని తాను స‌వాల్ చేస్తున్న‌ట్లు చెప్పారు మ‌హూవా మోయిత్రా(Mahua Moitra).

Also Read : సీతాపూర్ కేసులో బెయిల్ ఢిల్లీ కేసులో జైలు

Leave A Reply

Your Email Id will not be published!