Mahua Moitra : అన‌వ‌స‌ర రాద్ధాంతం మ‌హూవా ఆగ్ర‌హం

నిజం ఎప్ప‌టికీ నిల‌చే ఉంటుంది

Mahua Moitra : కాళీ దేవి పోస్ట‌ర్ పై చోటు చేసుకున్న వివాదం ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మ‌హూవా మోయిత్రాను(Mahua Moitra) టార్గెట్ చేసింది.

ఆమెపై ఫిర్యాదు కూడా చేసింది. ఇదే స‌మ‌యంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ మ‌హూవా మోయిత్రా చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని స్పష్టం చేసింది.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా టీఎంసీ ఎంపీ మ‌హూవాకు బేష‌ర‌త్తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు కాంగ్రెస్ కు చెందిన ఎంపీ శ‌శి థ‌రూర్. భారత రాజ్యాంగం ప్ర‌కారం మాట్లాడే హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ దేశంలో ప్ర‌తి వ్య‌క్తికి త‌మ‌దైన రీతిలో దేవుడిని ఆరాధించే హ‌క్కు ఉంద‌న్నారు. అంతే కాదు కాళీ దేవీని మాంసాహారం, మ‌ద్య‌పానం స్వీక‌రించే దేవ‌త‌గా ఊహించుకునే హ‌క్కు త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఉంద‌ని మ‌హూవా మోయిత్రా స్ప‌ష్టం చేశారు.

ఆమె బీజేపీపై నిప్పులు చెరిగారు ఎంపీ. బీజేపీ చిల్ల‌ర రాజకీయాలు చేస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌నని పేర్కొన్నారు. ఇప్ప‌టికే త‌న‌పై న‌మోదైన కేసుల‌కు సంబంధించి మండిప‌డ్డారు మోయిత్రా(Mahua Moitra).

త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న వారికి ధీటుగా క‌వితా రూపంలో ఉద‌హ‌రిస్తూ స‌మాధానం ఇచ్చారు. ఎ సిటిజ‌న్ ఆఫ్ ఇండియా పేరుతో షేర్ చేశారు. నిజం త‌ప్ప‌క నిలిచే ఉంటుంద‌ని, స‌త్యం ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ద‌ని పేర్కొంది ఎంపీ.

Also Read : మంత్రివ‌ర్గ కూర్పుపై షిండే స‌ర్కార్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!