Mahua Moitra : మణిపూర్ పై ఇక‌నైనా నోరు విప్పండి

నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ మ‌హువా

Mahua Moitra : టీఎంసీ ఎంపీ మ‌హూవా మొయిత్రా నిప్పులు చెరిగారు. పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆమె మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న హింస‌, అల్ల‌ర్ల‌ను ప్ర‌స్తావించారు. గ‌త మే 3 నుంచి మ‌ణిపూర్ త‌గుల‌బ‌డి పోతోంది. కేంద్రంలో , మ‌ణిపూర్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వాలు ఉన్నాయి. ఎందుక‌ని లా అండ్ ఆర్డ‌ర్ ను కంట్రోల్ చేయ‌లేక పోతున్నారంటూ ప్ర‌శ్నించారు ఎంపీ.

Mahua Moitra Asking

ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక లెక్క‌లు లేవు. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం ప‌దే ప‌దే మ‌ణిపూర్ హింసోన్మాదంపై కేంద్రాన్ని నిల‌దీసింది. కానీ ఇప్ప‌టి దాకా బాధ్య‌త క‌లిగిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కానీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కానీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆరోపించారు మ‌హువా మోయిత్రా(Mahua Moitra). ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాద‌న్నారు.

మ‌ణిపూర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 150 మందికి పైగా చ‌ని పోయారు. 300 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. 50 వేల మందికి పైగా నిరాశ్ర‌యులుగా మారారు. 10 వేల మందికి పైగా సైనికులు, ఆర్మీ మోహ‌రించినా ఎందుకని కంట్రోల్ కాలేక పోతోందంటూ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి నోరు మెదప‌క పోవడం దారుణ‌మ‌న్నారు మోయిత్రా.

Also Read : WI vs IND 1st T20 : తొలి టి20 మ్యాచ్ లో భార‌త్ బోల్తా

Leave A Reply

Your Email Id will not be published!