Kiren Rijiju : కేంద్రం అభ్యంతరం సుప్రీం బహిర్గతం
ఆగ్రహం వ్యక్తం చేసిన కిరెన్ రిజిజు
Kiren Rijiju : నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర న్యాయ వ్యవస్థ మధ్య దూరం పెరుగుతోంది. కొలీజియం వ్యవస్థను ఒప్పు కోవడం లేదు కేంద్రం. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju), ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టుపై. న్యాయమూర్తుల నియామకాల వివాదంలో , న్యాయమూర్తుల కోసం సిఫార్సు చేసిన అభ్యర్థులపై ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు బహిరంగ పర్చడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఏశారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). గత వారం భారత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం , న్యాయమూర్తి, దాని స్వంత కౌంటరర్ కోసం ముగ్గురు అభ్యర్థులను పెంచడంపై కేంద్రం తప్పు పట్టింది.
తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కేంద్రం వెలిబుచ్చిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు కిరెన్ రిజిజు. తగిన సమయంలో ప్రతిస్పందిస్తానని అన్నారు. ప్రభుత్వంతో గొడవల మధ్య ప్రభుత్వ అభ్యంతరాలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా ) ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) బహిరంగ పత్రాలను రూపొందించడంపై చర్చకు దారితీసేలా చేసింది.
రా లేదా ఐబీ రహస్య , సున్నితమైన నివేదికలను పబ్లిక్ డొమైన్ లో ఉంచడం ఆందోళన కలిగించే అంశమన్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). సీజేఐ నేను తరుచుగా కలుసుకుంటాం. ఆయన న్యాయ వ్యవస్థకు చీఫ్ . నేను ప్రభుత్వానికి , న్యాయ వ్యవస్థకు మధ్య వారధిని అని చెప్పారు. కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి.
Also Read : ‘కిరెన్’ కామెంట్స్ ‘కపిల్’ సీరియస్