Malayappa Rides : గజ వాహనంపై శ్రీవారు కనువిందు
ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Malayappa Rides : తిరుమల : పుణ్య క్షేత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు గజ వాహనంపై దర్శనం ఇచ్చారు .
మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగ భాగ్యాలు అభివృద్ధి అవుతాయి.
Malayappa Rides Gaja Vahanam
మంగళకరమైన గజ రాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వ భౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజ వాహనంపై ఊరేగారు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం.
స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజ రాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.
సాలకట్ల ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి హాజరయ్యారు.
Also Read : Surya Prabha Vahanam : సూర్య ప్రభ వాహనంపై శ్రీ మలయప్ప