Malla Reddy : హైదరాబాద్ – రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Malla Reddy) సెన్సేషన్ కామెంట్స్ చేశారు. తనను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనపంల్లి హన్మంతు రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నోరు పారేసుకుంటే ఓట్లు వస్తాయా అని ప్రశ్నించారు.
Malla Reddy Serious Comments on Mynampally
తనకు టికెట్ ఇచ్చినా పట్టించు కోకుండా కొడుక్కి టికెట్ ఇవ్వలేదని అలిగి వెళ్లి పోయిండని పేర్కొన్నారు. ఆ మాత్రం ఓపిక లేక పోతే ప్రజలు తనను నమ్మరని, ఈసారి ఎన్నికల్లో ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు మంత్రి మల్లారెడ్డి.
కాంగ్రెస్ పార్టీలోకి పోయిండి. మైనంపల్లి హన్మంతు రావు పిచ్చోడు అయ్యిండంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడం తనకే కాదు నాకు కూడా వచ్చని స్పష్టం చేశారు మల్లారెడ్డి.
పార్టీలు మారినంత మాత్రాన ఓట్లు పడతాయనే భ్రమలో ఉన్నాడని, మైనంపల్లికి అంత సీన్ లేదన్నారు .
ఇదిలా ఉండగా ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. వ్యక్తిగత విమర్శలకు దిగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Chandrababu Naidu : నెట్టింట్లో చంద్రబాబు వైరల్