Malladi Chandrasekhara Shastry : ‘మల్లాది శాస్త్రి’ కన్నుమూత
ప్రముఖ ప్రవచన కర్తగా పేరొందారు
Malladi Chandrasekhara Shastry: ప్రముఖ ప్రవచన కర్తగా పేరొందిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి (Malladi Chandrasekhara Shastry)ఇవాళ కన్ను మూశారు. ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహాసాలను ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా ప్రవచనాలు చేస్తూ వచ్చారు.
ఆలిండియా రేడియో, దూరదర్శన్ , టీటీడీ చానల్ లో ఎన్నో ప్రవచనాలు అందించారు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి ఘనాపాఠిగా పేరొందారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా క్రోసూరు ఆయన స్వస్థలం.
1925 ఆగస్టు 28న పుట్టారు. ప్రముఖ పండితుడు. పురాణ ప్రవచకులు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి (Malladi Chandrasekhara Shastry)స్వరంలోని మాధుర్యం, రామాయాణ, భారత, భాగవతాలపై ఆయనకు మంచి పట్టుంది. పురాణ ప్రవచన ప్రముఖలలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు.
తన 15వ ఏట నుంచి ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞం చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో దిట్ట.
సనాతన సంప్రదాయ గల కుటుంబంలో జన్మించిన ఆయన మొదటి నుంచీ ఆధ్మాత్మికత అంటే అభిమానం. అమరావతి పరిసర గ్రామాల్లో వేద విద్యలకు మల్లాది వారి కుటుంబం పేరు పొందింది.
బాల్యంలో తన తాత మల్లాది రామకృష్ణ సంస్కృతం, తెలుగు భాషా సాహిత్యాలు నేర్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా పని చేశారు.
స్వామి వారి కళ్యాణాన్ని భక్తులకు అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. సద్గురు శివానందమూర్తి సంస్థ ఎమినెంట్ సిటిజన్ అవార్డు అందించింది.
రాజా లక్ష్మీ అవార్డు ద్వారా వచ్చిన లక్ష రూపాయల నగదును సనాతన ధర్మ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి.
Also Read : గంగా సాగర్ కు పోటెత్తిన భక్తులు