Mallepalli Laxmaiah : శాంతి అవార్డు అందుకున్న ‘మల్లేపల్లి’
ప్రముఖ న్యాయవాది ఎంఏ ముజీబ్
Mallepalli Laxmaiah : ఆల్ ఇండియా బజ్మ్ ఆలం సంస్థ ప్రతి ఏటా వివిధ రంగాలలో అనుభవజ్ఞులకు, సమాజాన్ని ప్రభావితం చేసినందుకు శాంతి పురస్కారాన్ని అందజేస్తూ వస్తోంది. నిపుణులతో కూడిన కమిటీ సమావేశమై ఈ ఏడాది 2022కు సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ , బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి (ఓఎస్డీ )గా పని చేస్తున్న మల్లేపల్లి లక్ష్మయ్యను(Mallepalli Laxmaiah) ఎంపిక చేశారు.
ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ హైకోర్టు న్యాయవాదిగా పేరొందిన ఎం.ఎ.ముజీబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఖాజా మాన్షన్ హాలు లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లేపల్లి లక్ష్మయ్యకు శాంతి పురస్కారం (అవార్డు)ను అందజేసింది. మిలాద్ ఉన్న నబీ ఆల్ ఇండియా బజ్మ్ ఇ రహ్మద్ ఆలం కమటీ ఇప్పటి వరకు మల్లేపల్లి లక్ష్మయ్యతో కలుపుకుని ఏడుగురికి శాంతి అవార్డును అందజేసింది.
ఈ సందర్భంగా ఏఐబీఏ చీఫ్ ఎంఏ ముజీబ్ మాట్లాడారు. శాంతి , సామరస్యత ప్రాధాన్యత గురించి వివరించడంలో, తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్రం ఏర్పాటులో మల్లేపల్లి లక్ష్మయ్య ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నామని తెలిపారు. గతంలో చరిత్రకారులు, రచయితలకు ఇవ్వడం జరిగిందన్నారు.
తమ సంస్థ ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమానలు చేస్తూ వస్తోందని చెప్పారు ఎంఏ ముజీబ్. ఇదిలా ఉండగా ఈ విపత్కర పరిస్థితుల్లో తనను గుర్తించి తనకు శాంతి పురస్కారాన్ని అందజేయడం సంతోషం కలిగించిందని అన్నారు మల్లేపల్లి లక్ష్మయ్య. తెలంగాణ సంస్కృతి గొప్పదని ఇందుకు ఈ పురస్కారం ఓ నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ అవార్డు సన్మాన కార్యక్రమంలో మత పెద్దలు మౌలానా సయ్యద్ సాదత్ పీర్ బగ్దాదీ, సయ్యద్ మతీన్ అలీ షా ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు.
Also Read : మునుగోడులో గెలుపు బీజేపీకి మలుపు