Mallikarjun Kharge : ప్ర‌తిప‌క్ష నాయ‌క‌త్వ ప‌ద‌వికి ఖ‌ర్గే గుడ్ బై

రాజీనామా లేఖ సోనియా గాంధీకి అంద‌జేత

Mallikarjun Kharge :  గులాం న‌బీ ఆజాద్ త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌క్షాన నాయ‌క‌త్వం వ‌హిస్తూ వ‌చ్చారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో పార్టీ త‌ర‌పున మ‌ల్లికార్జున ఖ‌ర్గే నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

దీంతో ఒక నాయ‌కుడు ఒకే ప‌ద‌వి కలిగి ఉండాల‌న్న‌ది పార్టీ నియ‌మం. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎన్నిక‌య్యారు ఖ‌ర్గే. దీంతో తాను పార్టీ నియ‌మావ‌ళికి క‌ట్టుబ‌డి ఉండేందుకు గాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి ఈ లేఖ‌ను స‌మ‌ర్పించారు.

ఇదే విష‌యాన్ని శ‌నివారం వెల్ల‌డించారు. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో జ‌రిగిన పార్టీ చింత‌న్ బైట‌క్ లో ఒకే వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అని తీర్మానం చేశారు. ఆ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వికి నేను పోటీ చేస్తున్నాను.

పార్టీ రూల్స్ ప్ర‌కారం నేను రెండు ప‌ద‌వుల‌ను క‌లిగి ఉండ‌కూడ‌దు. తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డ‌మే మేల‌ని భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు ఖ‌ర్గే త‌న రాజీనామా లేఖ‌లో. ఒక‌వేళ ఖ‌ర్గేను ఎన్నుకుంటే ఆయ‌న స్థానంలో మ‌రో కాంగ్రెస్ ఎంపీని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా నిన్న‌టి దాకా రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, దిగ్విజ‌య్ సింగ్ , క‌మ‌ల్ నాథ్ పేర్లు వినిపించాయి. చివ‌ర‌కు మేడం సోనియా గాంధీ రాజ్య‌స‌భ ఎంపీ ఖ‌ర్గేను ఎంపిక చేసింది.

Also Read : ఎగ‌తాళి చేసిన వారే విస్తు పోతున్నారు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!